తన తాజా ప్రియుడు గౌతమ్ కొప్పిశెట్టితో బరితెగిస్తూ ఇనయ సుల్తానా వదిలిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో పెనుదుమారం రేపాయి. బీచ్‌లో.. బెడ్ రూం.. కిచెన్‌లో.. పబ్‌లో గబ్బులేపుతూ విచ్చలవిడిగా రొమాన్స్ చేసుకుంటూ వీళ్లు వదిలిన హాఫ్ న్యూడ్ ఫొటోలను చూసి బాబోయ్ ఇంత బరితెగిస్తున్నారేంట్రా బాబూ.. వీళ్లు ఎక్కువ కాలం కలిసి ఉండే బాపతులా లేదు అని వీళ్ల సయ్యాటలపై చాలామంది సెటైర్లు వేశారు. అయితే నాలుగు నెలలు తిరిగేసరికి ఆ సెటైర్లే నిజం అయ్యాయి.
తన ప్రియుడు గౌతమ్‌కి బ్రేకప్ చెప్పేసినట్టు ఉంది ఇనయా సుల్తానా. ఆమె ఈమెకి బ్రేకప్ చెప్పాడో.. లేదంటే ఈమే అతనికి బ్రేకప్ చెప్పిందో ఏమో కానీ.. తాను సింగిల్ అంటూ విరహవేదనతో రగిలిపోతున్న వరుస పోస్ట్‌లను షేర్ చేసింది ఇనయా సుల్తానా. అంతేకాదు.. తన ప్రియుడితో పెనవేసుకుని ఉన్న ఫొటోలన్నింటినీ డిలీట్ చేసి పారేసింది. అటు గౌతమ్ కూడా.. ఇనయాతో పెనవేసుకుని ఉన్న ఫొటోలన్నీ డిలీట్ చేసి పారేశాడు. నా లైఫ్, నా ఛాయిస్, నా ప్రాబ్లమ్స్, నా తప్పులు, నా పాఠాలు. మీరు నా గురించి మాట్లాడే ముందు మీ సొంత సమస్యలపై దృష్టిపెట్టండి. నా జీవితం గురించి చెప్పడానికి ఇది నీ కథ కాదు’ అంటూ కొటేషన్లు రాస్తుంది ఇనయా.
ఫైనల్‌గా బ్రేకప్ సింబల్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే.. ప్రియుడితో పెటాకులు అయ్యిందనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఇనయా సుల్తానా.. ఇయర్ ఎండింగ్ కావడంతో ఫారిన్ ట్రిప్‌లో ఉన్నట్టు ఉంది. అక్కడ హోటల్స్ రూం నుంచి ఫొటోలు, వీడియోలు వదలుతుంది. సింగిల్ గర్ల్.. సింగిల్ గర్ల్ అని. దీంతో మేం ముందే ఊహించాం కదా.. ఇలాంటిదేదో జరుగుతుందని. మీ రెచ్చిపోవడాలు చూసిన తరువాత.. బుద్దిన్నోడు ఎవడూ కూడా మీరు కలిసి ఉంటారని మాత్రం అనుకోరు. చివరికి అదే అయ్యింది. ఇంతకీ తమ్ముడు (గౌతమ్) కనిపించడం లేదు.. బ్రేకప్ చెప్పేశావా? చెప్పే ఉంటావ్‌లే’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఇక ఇనయా, గౌతమ్‌లు ఆ మధ్య గోవా వెళ్లి.. బెడ్ రూంలో హాఫ్ న్యూడ్‌గా ఉండి.. రొమాన్స్ చేసుకుంటూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వదిలారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కేవలం మీ బంధం బెడ్ రూం వరకేనా? పెళ్లి గట్రాలు ఏమైనా ఉన్నాయా? అని యాంకర్ శివ లాంటోడు ఓ ప్రశ్న వేయగా.. అప్పట్లోనే ఈ యవ్వారం కొన్నాళ్ల వరకే అనేట్టుగా సమాధానం ఇచ్చాడు ఇనయ ప్రియుడు గౌతమ్.పెళ్లా.. అబబ్బే.. అలాంటి ఉద్దేశం మాకు ఇప్పుడైతే లేదు. అయినా మేమిద్దరం చిన్నపిల్లలం.
మా గోల్స్ అచీవ్ చేసిన తరువాత పెళ్లి చేసుకుంటేనే మాకు సంతృప్తి.. అప్పటి వరకూ మాకు ఇదే తృప్తి’ అని అన్నాడు గౌతమ్. మా రిలేషన్ గురించి చాలామంది కామెంట్లు పెడుతున్నారు. వీళ్లు ఎంత కాలం కలిసి ఉంటారులే అని అంటున్నారు. వాటిని నేను కేర్ చేయను. అయినా మా రొమాంటిక్ ఫొటోలు బాగున్నాయి కదా చూసి ఆనందించాలి.. కానీ ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఏంటి?