Unstoppable With NBK: హీరో వెంకటేష్ కొడుకు అర్జున్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడా.. వెంకీ మామ రియాక్షన్ ఇదే!

Unstoppable With NBK: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వెంకటేష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు వెంకి మామ. అందులో భాగంగానే వచ్చే సంక్రాంతి పండుగకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు వెంకీ మామ. ఈ సినిమాలో వెంకీ మామ, సరసన మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.

సంక్రాంతి పండుగ కానుక జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు వెంకీ మామ. అందులో భాగంగానే తాజాగా వెంకీ మామ అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇద్దరూ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాప‌బుల్ షోలో పాల్గొన్నారు. ఆటలు పాటలు, డ్యాన్సులతో సందడి సందడి చేశారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రోమో లు కూడా విడుదలైన విషయం తెలిసిందే. బాలయ్య బాబు సరదాగా ఆట పట్టిస్తూనే మధ్యమధ్యలో కొన్ని ప్రశ్నలు కూడా వేశారు.

అందులో భాగంగానే వెంకటేష్ కొడుకు అర్జున్ గురించి కూడా ప్రశ్నించారు. కొడుకు గురించి వెంకటేష్ మాట్లాడుతూ ప్రస్తుతం తన కొడుకు అర్జున్ వయసు 20 సంవత్సరాలు అని అర్జునుని ప్రస్తుతం అమెరికాలో చదువుతున్నాడు అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అర్జున్ చాలా నిదానం అని తెలిపారు. అయితే ఈ ఎపిసోడ్ లో తన కొడుకు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు అన్న అంశంపై కూడా స్పందించినట్లు తెలుస్తోంది. వివరాలు తెలియాలి అంటే ఎందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ను చూడాల్సిందే.