స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం ‘సూర్య 44’. ఈ చిత్రానికి రెట్రో టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మేకర్స్ ముందుగా ప్రకటించినట్లుగా రెట్రో టైటిల్ టీజర్‌ను లాంచ్ చేశారు. హీరోహీరోయిన్లు ఇద్దరూ ఓ ఆలయం మెట్లపై కూర్చుని ఉండగా.. సూర్యకు తాయిత్తు కడుతోంది పూజాహెగ్డే. ఇది (తాయిత్తు)నా కోపాన్ని కంట్రోల్ చేస్తే.. నా తండ్రితో కలిసి పనిచేయడం ఆపేస్తా.. హింస, రౌడీయిజం లాంటి వాటిని ఈ క్షణం నుంచి వదిలిపెడతానంటున్నాడు సూర్య.
ఇంతకీ సూర్య ఎమోషన్స్‌ను ఆ తాయిత్తు కంట్రోల్ చేస్తుందా..? అనేది సస్పెన్స్‌లో పెడుతూ కట్ చేసిన టీజర్ సూర్యను పూర్తిగా మాస్ అవతార్‌లో చూపించబోతున్నట్టు చెప్పకనే చెబుతోంది. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మిస్తున్న ఈ మూవీలో పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
పీరియాడిక్ వార్ అండ్ లవ్ బ్యాక్ డ్రాప్‌లో వస్తోన్న ఈ మూవీకి తిరు, 24, పేటా ఫేం సినిమాటోగ్రఫర్ డీవోపీగా వర్క్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.