ఈగ ఫేం, కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చా సుదీప్ విక్రాంత్ రోన తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘మాక్స్’. విజయ్ కార్తికేయన్ డైరెక్ట్ (డెబ్యూ) చేస్తున్న మాక్స్ మూవీ టైటిల్ టీజర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రం డిసెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. మా పొలిటికల్ కెరీర్‌కు ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్.. అంటూ సాగే డైలాగ్స్‌తో మొదలైంది ట్రైలర్. సార్ మా అమ్మాయి కనబడటం లేదండి.. ఒక్కతే కూతురు సార్ అని ఓ తల్లి వేడుకుంటోంది.
ఈ ఒక్క రోజు రాత్రే స్వచ్చ భారత్ కార్యక్రమం చేపడుతాం. సేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చే ప్రతీ పకోడిగాడు సమాజసేవకుడే.. మొత్తం క్లీన్ చేద్దాం.. అంటూ సాగుతున్న సంభాషణలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇప్పటికే లాంచ్ చేసిన మాక్స్ గ్లింప్స్‌లో.. రాబోయే వాళ్ళు అగ్ని పర్వతం నుంచి తప్పించుకోవచ్చు. భూకంపం నుంచి తప్పించుకోవచ్చు.. తుఫాన్ నుంచి తప్పించుకోవచ్చు. సునామీ నుంచి కూడా తప్పించుకోవచ్చు కానీ వీడితో పెట్టుకుంటే సావు లేని వరంతో పుట్టినోడు కూడా చచ్చిపోతాడు.. అంటూ కిచ్చాసుదీప్ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసే సన్నివేశాలు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.