మంచు ఫ్యామిలీల్లో వివాదాలు పోలీసు కేసులు, సమన్లు నేపథ్యంలో మోహన్ బాబు దుబాయ్ వెళ్లిపోయినట్లుగా సమాచారం. ముందస్తు బెయిల్‌కు హైకోర్టు నిరాకరించడం, కోర్టు ఇచ్చిన రిలీఫ్ మంగళవారంతో ముగియనున్న తరుణంలో ఆయన ముందు జాగ్రత్తగా దుబాయ్ వెళ్లినట్లుగా ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. గతంలో హైకోర్టు పోలీసులు ఇచ్చిన నోటీసుపై 24వ తేదీ వరకూ స్టే ఇచ్చింది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరిగే అవకాశం లేదు. ఆయన ముందస్తు బెయిల్ తిరస్కరింతడంతో అరెస్టు నుంచి రక్షణ కల్పించే అవకాశాలు లేవు. మోహన్ బాబు ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్నారు.
ఆయన తన వద్ద ఉన్న గన్‌లను పోలీసులకు సరెండర్ చేశారు. కానీ హత్యాయత్నం కేసు మాత్రం బలంగా నిలబడింది. పోలీసులు ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నారు. కుటుంబ పరమైన సమస్యల్లో కేసులు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధంగా లేరు. అందుకే ఇప్పటి వరకూ వారి కుటుంబ గొడవల విషయంలో ఎలాంటి ఫిర్యాదు వచ్చినా కేసు నమోదు చేయలేదు. కానీ మీడియా ప్రతినిధి పై దాడి కేసు మాత్రం ఆయనకు సమస్యగా మారింది.
పోలీసులు ఎప్పుడు వచ్చి అరెస్ట్ చేస్తారోనని భయంతో అందుబాటులో లేరని తెలుస్తోంది. ఆయన దుబాయ్ వెళ్లారని.. సన్నిహితులు చెబుతున్నారు. దుబాయ్ వెళ్లి వచ్చారని, పోలీసులకు అందుబాటులో ఉంటారని ఆయన తరఫు లాయర్లు చెబుతున్నారు. అరెస్టు ముప్పు ఉంటే మాత్రం తదుపరి న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకునే వరకూ ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. ఆయన ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శించి మరో తప్పు చేశారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.