RRR Documentary: 27న ఓటీటీలోకి ”ఆర్‌ఆర్‌ఆర్‌” డాక్యుమెంటరీ

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో నటించగా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌, హాలీవుడ్‌ బ్యూటీ ఒలివియా కథానాయికలుగా నటించారు. డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రం ఈ సినిమా 2021లో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ అందుకోవడమే కాకుండా ఆస్కార్‌ అవార్డును గెలుచుకుంది. అయితే ఈ సినిమా మేకింగ్‌ వీడియోను డాక్యుమెంటరీ రూపంలో తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

‘ఆర్‌ఆర్‌ఆర్‌- బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ అంటూ వచ్చిన ఈ డాక్యుమెంటరీ ఇటీవలే ఎంపిక చేసిన మల్టీప్లెక్స్‌ స్క్రీన్‌లలో విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీ లాక్‌ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ కొత్త పోస్టర్‌ విడుదల చేసింది. ఈ డాక్యుమెంటరీ రన్‌ టైం 1 గంట 38 నిమిషాలు ఉంది.