టాలీవుడ్ స్టార్ నటులు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట పర్సనల్ లైఫ్‌లో చాలా సన్నిహితంగా ఉంటారు. ఇరు కుటుంబాల మధ్య కూడా చక్కటి స్నేహసంబంధాలున్నాయి.
ఈ నేపథ్యంలో వీరిద్దరి లవ్ ఎఫైర్‌పై అనేక కథనాలొచ్చాయి. అయితే తాము కేవలం స్నేహితులం మాత్రమేనని, తమ మధ్య ఎలాంటి ప్రేమబంధం లేదని ఈ తారలిద్దరూ అనేక సందర్భాల్లో వివరణ ఇచ్చారు. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి వెళుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ జంట ముంబయి విమానాశ్రయంలో తళుక్కున మెరిసింది. సోమవారం రాత్రి ఇద్దరూ కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించగా.. కెమెరాలు క్లిక్ మనిపించాయి.
మొదట రష్మిక ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి మీడియాకి ఫోజులిచ్చింది. అనంతరం కాసేపటికే మరో కారులో నుంచి విజయ్ దేవరకొండ దిగాడు. వీరిద్దరూ క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళుతున్నట్లు సమాచారం. సినిమాల విషయానికి వస్తే.. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా చేస్తున్నాడు. ‘పుష్ప 2 ది రూల్’ హిట్ అందుకున్న రష్మిక ప్రస్తుతం విక్కీ కౌశల్‌తో ‘చావా’ అనే సినిమాలో నటిస్తుంది.