తన సినిమా రిలీజ్ విషయంలో నిర్మాత పెత్తనాన్ని ఓ యంగ్ హీరో అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు. అదేంటీ, సినిమా అంటే నిర్మాత ప్రాపర్టీ కదా.! డబ్బులు పెట్టేది నిర్మాత. లాభమొచ్చినా, నష్టమొచ్చినా అది నిర్మాతకు సంబంధించిన విషయమే. కష్ట సుఖాలు నిర్మాతవే.
అలాగని, హీరో కష్టాన్ని తక్కువగా చూడలేం. దర్శకుడి వ్యవహారమూ అంతే. అయినాగానీ హీరో అలాగే దర్శకుడి కంటే నిర్మాతకే సినిమాపై హక్కులు ఎక్కువ వుంటాయ్. సినిమాని మంచి టైమ్‌లో రిలీజ్ చేయాలని నిర్మాత అనుకుంటాడు. కానీ, ఆ హీరో కథ వేరు.
అతనే దర్శకుడు, అతనే కథా రచయిత, అతనే నిర్మాత.. అలా వ్యవహరిస్తుంటాడు. సొంత సినిమాలకు ఆ హీరో ఏమైనా చేసుకోవచ్చు. ఇతర నిర్మాతలతో పని చేస్తే, ఆ నిర్మాత చెప్పినట్లు వినాలి కదా.? వినేది లేదంటున్నాడు. కష్టాలు కొనితెచ్చుకుంటున్నాడు.
ప్రమోషన్లకు రానని ఆ హీరో ముందే చెప్పేశాడు. ‘వాడు వస్తే రానీ, రాకపోతే మానేయనీ..’ అంటున్నాడట నిర్మాత. మరీ, అంత వైల్డ్‌గా మారిందా వ్యవహారం.? అంటే, అంతకు మించి.. అంటున్నారు.
అయితే, తెరవెనుక రాజీ ప్రయత్నాలు నడుస్తున్నాయ్. హీరో తప్పనిసరి పరిస్థితుల్లో రాజీకి వెళ్లే అవకాశమూ లేకపోలేదట. ఇంకెందుకీ మేకపోతు గాంభీర్యం.. అంటే, అదంతే.!