Harish Rao: తెలంగాణ బిఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఈయన చింతకాని మండలంలో పర్యటించారు. భూ వివాదంలో ఆత్మహత్యకు పాల్పడిన బోజెడ్ల ప్రభాకర్‌రావు కుటుంబాన్ని పరామర్శించారు.
ఇలా ఆ కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మార్పు మొదలైందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడంలో మాట తప్పారని అదే రాష్ట్రంలో జరుగుతున్న మార్పు అంటూ హరీష్ రావు సెటైర్లు వేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు తీవ్ర అన్యాయం చేశారు.ఆరు లక్షల తులాల బంగారం కళ్యాణలక్ష్మీకి బాకీ పడింది. భద్రాద్రి రాములోరి సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు చెయ్యలేకపోయారు ఇలా పాలకుడే మాట తప్పితే ప్రజలకు అన్యాయం కాక న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని నేనొక్కటే కోరుకున్న ఈ ముఖ్యమంత్రికి కాస్త మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకున్నానని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే పని తక్కువ లొల్లి మాత్రం ఎక్కువ అంటూ హరీష్ రావు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఇంటింటికి కార్డులు ఇచ్చారు మరి ఆరు గ్యారెంటీలలో ఒక్కటైన సక్రమంగా ప్రజలకు ఇచ్చారా ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి తన పరిపాలన ఎలా ఉంది అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలిపారు. ఈయన పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాకుండా ఎగవేతల రేవంత్ రెడ్డి అని పెడితే కరెక్ట్ గా సరిపోతుందని హరీష్ రావు ముఖ్యమంత్రి పై కామెంట్లు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.