నయనతార: బియాండ్ ది ఫేరిటైల్ డాక్యుమెంటరీకి నయనతార వివాదం వల్ల మంచి పబ్లిసిటీ వచ్చింది. తన సినిమాలో క్లిప్పింగ్ వాడుకున్నందుకు 10 కోట్లు ధనుష్ కట్టమనడంతో ఈ వివాదం చెలరేగింది. అయితే ఇండస్ట్రీలో కొంతమంది నయనతారని సపోర్ట్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ధనుష్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయం పక్కనపెడితే నయనతార కి వివాదాలు కొత్త ఏమీ కాదు. గతంలో చాలామంది హీరో హీరోయిన్లతో ఆమెకి చాలానే వివాదాలు జరిగాయి అవి ఏమిటో చూద్దాం.
ముందుగా సింబు విషయానికి వస్తే అతనితో పీకలలోతూ ప్రేమలో మునిగిపోయిన నయనతార తరువాత కొన్ని పర్సనల్ ఫొటోస్ సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వటంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. తర్వాత పెళ్లయి పిల్లలు ఉన్న ప్రభుదేవాతో పెళ్లి వరకు వెళ్లినప్పటికీ ప్రభుదేవా భార్య లీగల్ ఇష్యూస్ తీసుకురావడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అలాగే గతంలో అజిత్ సినిమా బిల్లా చేస్తున్నప్పుడు తన తోటి హీరోయిన్ అయిన నమితతో గొడవ పడింది.
సినిమాల కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకునే నయనతార మూవీ ప్రమోషన్స్ కి మాత్రం హాజరవదు. ఈ విషయంలో నిర్మాతలు ఇప్పటికీ ఆమెపై ఫిర్యాదు చేస్తూ ఉంటారు. అలాగే పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి తిరుపతికి వెళ్లిన నయనతార ఆలయ ప్రాంగణంలో చెప్పులతో తిరగటంతో మరొకసారి వివాదంలో ఇరుక్కుంది. ఆ సమయంలో ఆమె భర్త విగ్నేష్ శివన్ క్షమాపణ చెప్పటంతో వివాదం సద్దుమణిగింది. నానుం రౌడీ థాన్ సినిమా అవార్డు తీసుకోవడానికి స్టేజి మీదకి వెళ్ళిన నయనతార అల్లు అర్జున్ చేతుల మీదుగా ఆ అవార్డు తీసుకోవడానికి ఇష్టపడలేదు.
ఈ అవమానాన్ని భరించలేని అల్లు అర్జున్ ఆమెతో సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అలాగే పెళ్లి అయిన నాలుగు నెలలకే ఇద్దరు బిడ్డలకి తల్లి అవ్వడం పట్ల పెళ్ళికి ముందే సరోగసి విధానం ద్వారా బిడ్డలని కనడం ద్వారా, మరొకసారి వివాదంలో ఇరుక్కుంది. ఇప్పుడు ధనుష్ తో వివాదం ప్రస్తుతం పోటా పోటీ గానే సాగుతోంది. చివరికి వివాదం ఎక్కడ ముగుస్తుందో వేచి చూడాల్సిందే.