ఓ తెలుగు కుర్రాడితో ప్రేమలో పడ్డావట కదా.. అంటూ హీరోయిన్ మృనాల్ ఠాకూర్‌కి ఈ మధ్య ప్రశ్నలు ఎదురవుతున్నాయ్. అది కూడా నేషనల్ మీడియా నుంచి. కొన్నాళ్ళ క్రితం, ‘తెలుగు కుర్రాడ్ని పెళ్ళి చేసుకుని, తెలుగింటి కోడలైపోవచ్చు కదా..’ అని సరదాగా ఓ ప్రముఖ నిర్మాత మృనాల్ ఠాకూర్ మీద సరదా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
తొలి సినిమా ‘సీతారామం’ నుంచి ఇప్పటిదాకా.. మృనాల్ ఠాకూర్ మీద, పెద్దగా పెళ్ళి విషయమై గాసిప్స్ వచ్చింది లేదు. సరదా సరదా సందర్భాలు తప్ప. మృనాల్ యాక్టింగ్ కెరీర్ విషయంలో చాలా ప్రొఫెషనల్. అయితేనేం, ఆమెకు మాత్రం ప్రేమ మీద సదభిప్రాయం లేకుండా వుంటుందా.?
ప్రేమ పెళ్ళా.? పెద్దలు కుదిర్చిన పెళ్ళా.? అని ప్రశ్నిస్తే, ‘టైమ్ విల్ డిసైడ్’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మృనాల్ ఠాకూర్. కొన్ని సందర్భాల్లో నవ్వేసి ఊరుకుంది కూడా. మౌనం అర్థాంగీకారమంటూ ప్రేమ వివాహంపై మృనాల్‌ని వివాదాల్లోకి లాగేశారు కొందరు.
తాజాగా, నేషనల్ మీడియా నుంచి, ‘తెలుగు కుర్రాడ్నే ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్నావట కదా.?’ అన్న ప్రశ్న ఎదురైతే, ‘ప్రేమా గీమా జాన్తా నై’ అనేసిందిట మృనాల్ ఠాకూర్. కెరీర్ పీక్స్‌లో వున్నప్పుడు, ఇలాంటి గాసిప్స్ ఇబ్బంది పెడతాయని మృనాల్ ఠాకూర్‌కి బాగా తెలుసు.
పెళ్ళికి కెరీర్ అడ్డంకి కాదు.. అలాగే కెరీర్‌కి పెళ్ళీ అడ్డంకి కాదు.. కాకపోతే, ఇంకా ప్రేమ – పెళ్ళి వంటి వాటి గురించి ఆలోచించేందుకు సమయం వుందన్నది మృనాల్ ఠాకూర్ ఉవాచ.
అన్నట్టు, ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో మృనాల్ ఠాకూర్ ప్రేమలో పడిందంటూ గత కొద్ది రోజులుగా గాసిప్స్ గుప్పుమంటున్నాయండోయ్.!