RK Roja: ఏపీలో ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏకంగా 164 స్థానాలలో విజయం అందుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా ఈ విజయం పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మరీ 11 స్థానాలకు పరిమితమయ్యే విధంగా పాలన అయితే అసలు చేయలేదు ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ మేము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసామని చెబుతున్నారు అలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలు మాత్రమే రావడం ఏంటి ఏదో కుట్ర జరిగింది అనే సందేహాలు ప్రతి ఒక్క సాధారణ వ్యక్తిలో కూడా మొదలయ్యాయి.
ఇక ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కొంత మంది వైకాపా నేతలు అలాగే ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఈవీఎం మిషన్ల గురించి సందేహాలు వ్యక్తం చేశారు అయితే ఈ వ్యవహారంపై కేసులు కూడా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా ఈవీఎంల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈవీఎం ద్వారా ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి అంటే ఆ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలను అలాగే వీవీ పాట్ లను ఆరు నెలల వరకు భద్రపరచాలి అదే విధంగానే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేస్తుంది కానీ ఏపీలో జరిగిన ఎన్నికలను చూస్తే అందరికీ సందేహాలు కలుగుతున్నాయని తెలిపారు. కేవలం ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల వ్యవధిలోనే వివి ప్యాట్లను కూడా నాశనం చేసేసారని రోజా తెలిపారు.
ఇలా ఆరు నెలల వరకు వాటిని భద్రపరచాల్సి ఉండగా పూర్తి సమయం ముగియకుండానే వివి ప్యాట్లను నాశనం చేయడంతోనే ఏదో కుట్ర జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది.ఇక ఎన్నికల సమయంలో ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఎంత శాతం ఓటింగ్ నమోదు అయింది ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది స్పష్టంగా రికార్డు అయి ఉంటుంది అలాగే ఎన్నికల ఓట్ల సమయంలో కూడా ఈ రెండు మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది కానీ ఓట్లు వేసిన దాని కంటే కూడా ఎన్నికల సమయంలో ఏకంగా 45 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. ఇలా 45 లక్షల ఓట్లు ఎక్కువగా ఎలా వచ్చాయి అంటూ కూడా రోజా ప్రశ్నిస్తూ ఏదో కుట్ర జరిగిందని అనుమానాలను వ్యక్తం చేయడంతో ఇందుకు సంబంధించిన ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి.
ఈవీఎంల గురించి నిజాలు చెప్పిన రోజా గారు :
2019 లో మేము గెలిచినప్పుడు ఈవీఎంలు,VVPT స్లిప్ లు సిక్స్ మంత్స్ ఉన్నాయి..
కానీ ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం గెలిచిన ఈవీఎంలు, VVPT లో స్లిప్ లు రిజల్ట్స్ వచ్చిన వన్ వీక్ లోనే డిలీట్ చేశారు అంటేనే అర్థం చేసుకోవాలి 2024 ఎన్నికల్లో ఎంత… pic.twitter.com/e6sUrtIqoZ— Anitha Reddy (@Anithareddyatp) November 21, 2024