తండ్రి కంటే ఎవరూ ఎక్కువ కాదంటున్న బన్నీ.. బాలయ్యకే షాకిచ్చిన అర్హ!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అంతకుముందే నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న ఆన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నాడు బన్నీ .ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేస్తున్నారు ఆహా టీం. ఇదివరకే ఫస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ అయింది.

ఆ ఎపిసోడ్ మంచి సక్సెస్ ని అందుకుంది ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. ఈ షోలో బన్నీ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ షోలో ఎప్పుడూ బయట కనిపించని అల్లు అర్జున్ తల్లి కనిపించడం విశేషం. అలాగే అల్లు అర్జున్ పిల్లలు కూడా ఈ ఎపిసోడ్ లో సందడి చేశారు. అల్లు అర్జున్ కూతురు అర్హ పదవ తరగతి తెలుగు పద్యాన్ని అనర్కళంగా చెప్పింది.

ఆమె తెలుగు వాక్చాతుర్యానికి ఆడియన్స్ తో పాటు బాలయ్య సైతం ఆశ్చర్యపోయారు. దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నారు. ఇక బన్నీ తనయుడు అయాన్ తనకి హీరోలు ప్రభాస్, చిరంజీవి అంటే ఇష్టమని చెప్పాడు. అలాగే అల్లు అర్జున్ మాట్లాడుతూ తనకి ఈ ప్రపంచంలో తన తండ్రి కంటే ఇష్టమైన వ్యక్తి మరెవరూ లేరని, అయినా మా ఇద్దరికీ కొన్ని విషయాల్లో అభిప్రాయాలు వేరుగా ఉంటాయి.

అంటే అక్కడ నాకు మా నాన్నకి పడటం లేదని కాదు సబ్జెక్టు వరకు మాత్రమే పడటం లేదు అని భావిస్తాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటేనే రిలేషన్షిప్ బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. రిలేషన్ షిప్ గురించి అల్లు అర్జున్ ఎంత అద్భుతంగా చెప్పారు అంటూ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. పిల్లలతో అల్లు అర్జున్ చేసిన సందడి ప్రోమోలో చూసిన ప్రేక్షకులు తెగ ఫిదా అయ్యారు. మరెందుకు ఆలస్యం ట్రెండింగ్ లో ఉన్న ఈ ఎపిసోడ్ ఆహ లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు కూడా ఒక లుక్ వేయండి, ఎంజాయ్ చేయండి.