ఇదీ కరెక్ట్ మీటర్.! అంతేనా.? అలాగే అనుకోవాలా.? వైసీపీ ప్రధానంగా ఈ మధ్య విమర్శలు చేస్తున్నది జనసేన మీదనే.! టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఎడా పెడా ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేస్తున్నా, వైసీపీ మాత్రం పూర్తిగా జనసేన మీద ఫోకస్ పెట్టింది.
టీడీపీ అనుకూల మీడియాలో జనసేన వార్తలు తక్కువగా వస్తున్నాయ్‌గానీ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయం పూర్తిగా వైసీపీ – జనసేన చుట్టూనే తిరుగుతున్నాయన్నది నిర్వివాదాంశం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి విజయ యాత్ర ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో గట్టిగానే వుండబోతోంది. ఈ విషయం టీడీపీకి కూడా అర్థమవుతోంది. వైసీపీ ఏనాడో ఈ విషయాన్ని గుర్తించింది. జనసేన బలపడితే, టీడీపీ బలహీనపడితే.. వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది.
ఐ-ప్యాక్ సలహాతోనో, లేదంటే సొంత రాజకీయ ఆలోచనతోనో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన మీదకు వైసీపీ శ్రేణుల్ని పూర్తి స్థాయిలో ఉసిగొల్పుతున్నారు. ఇది ఓ రకంగా సత్ఫలితాన్నే ఇస్తోంది. జనసేనాని సీరియస్ పొలిటీషియన్ కాదని జగన్ బలంగా నమ్ముతున్నారు.
టీడీపీని పూర్తిగా ఇంటికి పంపించేయాలంటే, రాష్ట్రంలో జనసేన బలపడాలి. జనసేన బలపడినా, ప్రతిపక్షంలోకి వచ్చినా.. ఆ పార్టీని తొక్కేయడం జనసేనకు చాలా తేలిక. ఈ వ్యూహంతోనే వైఎస్ జగన్.. జనసేన పార్టీకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
అయితే, తమ వ్యూహాలు తమకున్నాయనీ.. వైసీపీ సర్కారుని గద్దె దించి తీరుతామని జనసేన అంటోంది. కానీ, ఓ వైపు వైసీపీతో.. ఇంకోవైపు టీడీపీతో రాజకీయ పోరాటం చేయాల్సి వస్తే.. అది జనసేనకు కష్టకాలమే.!