ముద్రగడ విషయంలో వెనక్కి తగ్గిన పవన్… ఇదిగో ప్రూఫ్!

ఒక‌ప్పుడు కాపు ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి, కాపులకు కీలకనేతగా ఉన్న ముద్ర‌గ‌డ పద్మ‌నాభం కొన్ని రోజులుగా ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారారు. పవన్ కల్యాన్ కాకినాడ సభలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చేసిన పరోక్ష కామెంట్లపై ముద్రగడ ఫైరయ్యారు… పవన్ ను టార్గెట్ చేస్తూ రెండు బహిరంగ లేఖలు రాశారు.

ఆ లేఖలు ఏస్థాయిలో వైరల్ అయ్యాయనేది తెలిసిన విషయమే. మొదటిలేఖలో సున్నితంగా స్పందించినట్లు కనిపించిన ముద్రగడ… రెండో లేఖకు వచ్చేసరికి పవన్ కు ముచ్చెమటలు పట్టించేశారన్న కామెంట్లు వినిపించాయి. ఇందులో ప్రముఖంగా పిఠాపురం లో పోటీకి సై అనే స్థాయిలో విసిరిన ఛాలెంజ్ మరీ హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ రెండు లేఖల్లో ఏదో ఒకదానిపై అయినా పవన్ స్పందిస్తారని అంతా భావించారు. ఎట్టిపరిస్థితుల్లో పవన్ రియాక్ట్ అవ్వాలని జనసైనికులు కోరుకున్నారు. ఇదే సమయంలో ముద్రగడ ఛాలెంజ్ పై అయినా స్పందింస్తారని అంతా భావించారు. కానీ… పవన్ తాను ప్రిపేర్ అయిన ప్రసంగాలు చేసుకుంటూవెళ్లారే తప్ప… తాను చేసిన విమర్శలపై కౌంటర్స్ ఇచ్చిన ఏ నేత టాపిక్కూ ఎత్తలేదు.

ఇలా బురద జల్లడం.. అనంతరం అవతలి వ్యక్తులు చెడామడా వాయించేసరికి అక్కడనుంచి పలాయనం చిత్తగించడం పవన్ కు అలవాటే అనే కామెంట్లు తెగ హల్ చల్ చేశాయి. ఈ క్రమంలో తాజాగా మలికిపురం సభలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. పవన్ ప్రసంగిస్తున్న సమయంలో… ఒక జనసైనికుడు ముద్రగడ పద్మనాభంకు వ్యతిరేకంగా బ్యానర్ పట్టుకుని కనిపించాడు.

దీంతో పర్యవసానాలపై ఉలిక్కిపడ్డారో.. లేక, ఇంకా ముద్రగబెట్టుకుంటే ముద్రగడతో ప్రమాధం అని భావించారో తెలియదు కానీ.. ప్రసంగాన్ని ఒక్క నిమిషంపాటు ఆపేశారు. ఆ బ్యానర్ ను కిందకు దింపమని కోరారు. పెద్ద‌లు మ‌న‌ల్ని కొన్నిసార్లు కొన్ని మాట‌లు అంటారు.. అంత‌మాత్రాన వాళ్ల‌ను మ‌నం ఏమీ అన‌కూడ‌దు అంటూ వ్యాఖ్యానించారు.

దీంతో.. ప్రతీ విషయంలోనూ జుట్టు ఎగరేస్తూ, చేతులు పైకెత్తుతూ, అరుస్తూ రియాక్ట్ అయ్యే పవన్… ముద్రగడ విషయంలో మాత్రం తోక ముడిచారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ముద్రగడా మజాకా అంటూ మరో కామెంట్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. పవన్ కి ఆ బ్యానర్ చూడగానే కలిగిన భయాన్ని… అలా కవర్ చేశారంటూ మరో కామెంట్.

ఏది ఏమైనా… పవన్ మాత్రం హుందాగా స్పందిస్తూ మరో రచ్చ జరగకుండా జాగ్రత్తపడ్డారు అనేది విశ్లేషకుల అభిప్రాయం!