Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాజాగా బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రామ్ చరణ్ బాలయ్య టాక్ షోలో పాల్గొన్నారు.
ఈ టాక్ షోలో భాగంగా బాలకృష్ణ రామ్ చరణ్ కుమార్తె క్లీన్ కార గురించి ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా క్లీన్ కారా పుట్టినరోజు రామ్ చరణ్ థియేటర్ నుంచి బయటకు ఎంతో సంతోషంతో రావడం అలాగే తన కుమార్తెను తీసుకొని వచ్చినటువంటి వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది అయితే ఈ వీడియోని బాలయ్య ప్లే చేస్తూ తన కూతురి గురించి రామ్ చరణ్ ను పలు ప్రశ్నలు వేశారు ఇక ఈ వీడియో చూడగానే చరణ్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ఉపాసన రాంచరణ్ పెళ్లి చేసుకున్న సుమారు 11 సంవత్సరాలకు ఈ చిన్నారి జన్మించిన విషయం తెలిసిందే. అయితే తన కూతురి గురించి చరణ్ మాట్లాడుతూ తన కూతురికి ప్రస్తుతం ఒకటిన్నర సంవత్సరం చాలా బక్కగా ఉంటుంది ఒక ముద్ద తిన్న ఒక కిలోమీటర్ పరిగెడుతుంది అంత ఎనర్జీ తనకు ఉంది. నేను మొదటి నుంచి కూడా కూతురు కావాలని కోరుకున్నాను అలాగే నాకు కూతురు పుట్టిందని చరణ్ తెలిపారు. ఇక ప్రస్తుతం పాపతో తాను ఎంతో విలువైన సమయాన్ని గడుపుతున్నానని మొదటి మూడు సంవత్సరాల వరకు నా సమయం తనకే కేటాయిస్తానని తెలిపారు.
ఇక తన గురించి మాట్లాడుతూ తన కూతురికి నేను ప్రైవసీ అనే గిఫ్ట్ ఇచ్చానని తెలిపారు. అందుకే తనని ఎవరికి చూపించలేదని చరణ్ తెలిపారు. మేము స్కూల్ కి వెళ్లే సమయంలో సెలబ్రిటీల పిల్లలమని మమ్మల్ని గుర్తించేవారు తద్వారా మేము ఫ్రీగా ఉండలేకపోయాము అది నాకు చాలా భారంగా అనిపించింది అలాంటి భారం నా కూతురు మోయకూడదు అనుకున్నాను అందుకే తనకు ప్రైవసీ అనే ఒక గిఫ్ట్ ఇచ్చానని ఆ కారణంతోనే తన కుమార్తెను ఎవరికి చూపించడం లేదనీ చరణ్ ఈ సందర్భంగా తన కుమార్తె గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.