Ambanti: సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుందా అంటే అవునని చెప్పాలి కొద్దిరోజులుగా పుష్ప సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడంతో అభిమాని మరణించగా దీంతో ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మార్చేశారు. దీంతో అక్కడ ముఖ్యమంత్రి తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు ఇవ్వనని సినిమా టికెట్లు రేట్లు పెంచాలని క్లారిటీ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి నిర్ణయంతో తెలుగు సినిమాలన్నీ కూడా ఏపీ వైపు దారి పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా వేడుక ఘనంగా జరిగింది అయితే ఈ వేడుక నుంచి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో మెగా అభిమానులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రాజకీయం చేస్తున్నారు.
ఇదే ఘటన తెలంగాణలో జరిగితే అల్లు అర్జున్ జైలుకు పంపించారు అంటూ అధికార ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకువస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మొదటినుంచి కూడా అల్లు అర్జున్ కు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్న అంబంటి రాంబాబు తాజాగా సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇస్తూ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఈయన స్పందిస్తూ..నీతులు ‘పుష్ప’కేనా.. మీరు పాటించరా? అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై సెటైర్ వేశారు. పుష్ప కేమో నీతులు చెప్తారా ! గేమ్ చేంజర్ కి పాటించరా అంటూ ఈయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇక ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గత ప్రభుత్వం రోడ్లు వేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఈయన కామెంట్లు చేయడమే కాకుండా జనసేన పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
“పుష్ప” కేమో నీతులు చెప్తారా !
“గేమ్ చేంజర్’ కి పాటించరా !@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) January 6, 2025
ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం
కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్నా ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం…
— Pawan Kalyan (@PawanKalyan) January 6, 2025