AP: నీతులు చెప్పకండి డిప్యూటీ సీఎం గారు… సీజ్ ద రోడ్ అనాలి కదా : శ్యామల

AP: ఏపీలో రామ్ చరణ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది అయితే ఈ వేడుక నుంచి తిరిగి ఇంటికి వెళుతున్నటువంటి ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే ఈ యాక్సిడెంట్ ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఇదే అదునుగా భావించిన కొంతమంది వైకాపా నాయకులు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ ఘటనపై అంబంటి రాంబాబు రోజా వంటి వారు స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల స్పందించారు. ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఈ సందర్భంగా యాంకర్ శ్యామల ఇద్దరు అభిమానులు మరణించిన విషయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతులు మాత్రమే చెబుతారు వాటిని ఆచరించరని తెలిపారు. ఈ సినిమా వేడుకకు హాజరయ్యి ఇద్దరు అభిమానులు మరణిస్తే ఆ మరణాన్ని కూడా మా ప్రభుత్వంపై తోసేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు.

కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్ కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు సర్ SEIZE THE ROAD.. అనాలి కదా? అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై ఈమె సెటైర్లు పేల్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీరు యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు.

సినిమాలకు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగులు చేయండి, ఈలలు వేసి గోల చెయ్యండి అంటూ యువతను రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడే మాటలు కాదని తెలిపారు. మీ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతో కనీసం వెళ్లి పరామర్శించారా? అంటే మీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేస్తున్నారా అంటూ యాంకర్ శ్యామల ఈ ఘటనపై చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.