Tirupathi: తిరుపతి తొక్కిసలాట ఘటన…… మృతులకు భారీ పరిహారం ప్రకటించిన ఏపీ సర్కార్!

Tirupathi: తిరుమలలో వైకుంఠ ద్వారం దర్శన టోకెన్లను జారీ చేయడంతో ఆ టోకెన్లను తీసుకోవడం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఇలా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో భాగంగా సుమారు 40 మంది వరకు గాయాలు పాలు కాగా 6 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇప్పటికే ఏపీ కూటమి పార్టీ నేతలు వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఇక ఈ తొక్కిసలాట ఘటనలో భాగంగా మృతి చెందిన కుటుంబాలకు ఏపీ సర్కార్ భారీ పరిహారం ప్రకటించారు. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారాన్ని అందజేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇలా ఒక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడం విశేషం ఇక గాయపడిన వారందరినీ కూడా రుయా, స్విమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే భద్రత లోపం సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయనీ స్పష్టమవుతుంది. ఇకపై తిరుపతిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాము అంటూ టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు ఈ ఘటన పై స్పందిస్తూ సానుభూతి తెలియజేశారు మనం ఏమి చేయలేమని అంతా ఆ దైవ నిర్ణయమే అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.