Pushpa 2: పుష్ప సినిమా హీరో దొంగ కాకపోతే మహానుభావుడా…. ఫైర్ అయిన రాజేంద్రప్రసాద్!

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 తొక్కిసలాట ఘటనలో భాగంగా అరెస్టు కావడంతో ఎంతో మంది ఈయనపై విమర్శలు చేశారు అంతేకాకుండా ఈయన ఒక స్మగ్లర్ పాత్రలో కనిపించడంతో చాలామంది ఈయన పాత్ర పై కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా విమర్శించిన వారిలో నటి కిరీటి రాజేంద్రప్రసాద్ ఒకరు. ఈయన గతంలో తన సినిమా వేడుకలో మాట్లాడుతూ ఒకప్పుడు హీరోలు ఒక మంచి సందేశాన్ని ప్రజలకు తెలియజేసేవారు.

ప్రస్తుతమున్న హీరోలు మాత్రం సినిమాల ద్వారా ఎలా స్మగ్లింగ్ చేయొచ్చు ఎలా దొంగతనాలు చేయడం చూపించే వాళ్ళు హీరోలేనా అంటూ అల్లు అర్జున్ గురించి విమర్శలు చేశారు అయితే ఈయన విమర్శలపై పూర్తిస్థాయిలో వ్యతిరేకత రావడంతో తాను అల్లు అర్జున్ ని ఆ ఉద్దేశంతో మాట్లాడలేదని తను నా బిడ్డతో సమానం అంటూ మాట్లాడారు.

అయితే తాజాగా మరోసారి ఈయన తన సష్టిపూర్తి అనే సినిమా వేడుకలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా తిరిగి అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యల పట్ల ప్రస్తావన రావడంతో తాను ఇటీవల అల్లు అర్జున్ కలిసి మాట్లాడినప్పుడు అంకుల్ మీరు నా గురించి అలా మాట్లాడి ఉండరు నాకు తెలుసు అంటూ చెప్పాడు ఓరి పిచ్చి నా కొడకా నేను అలాగే మాట్లాడాను రా అని నేను అల్లు అర్జున్ కి చెప్పాను.

ఒకవేళ మీరు అలా మాట్లాడిన అలాంటి ఉద్దేశంతో మాట్లాడి ఉండరు అంటూ అల్లు అర్జున్ నాతో చెప్పారు ఇది కరెక్ట్ నేను మాట్లాడిన ఉద్దేశం అది కాదు. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా నెగిటివిటీ పెరిగిపోయిందని తెలిపారు నేను కూడా నా సినిమాలపై నేనే నన్ను తిట్టుకున్నానని తెలిపారు. మేడం లేడీస్ టైలర్ వంట సినిమాలలో నేను నటించడం నటనకు నాకే కోపం వచ్చిందని రాజేంద్రప్రసాద్ తెలిపారు.

ఇక పుష్ప సినిమాలో హీరో దొంగతనాలు చేస్తే దొంగ అనకుండా మహానుభావుడు అనాలా మరి ఆయన చేసే అలాంటి ఇలాంటి దొంగతనం కాదు ఎర్రచందనం దొంగతనం అంటూ మరోసారి రాజేంద్రప్రసాద్ అల్లు అర్జున్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.