Tirumala: కర్మ ఎవరి నీ వదలదు… దేవుడిపై రాజకీయం చేశావు…. ఫలితం ఇదే: భూమన

Tirumala: తిరుమల తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో భాగంగా ఆరుగురు భక్తులు మరణించారు అయితే ఈ విషయంపై ఎంతో మంది రాజకీయ నాయకులు స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా వైకాపా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ ఘటన జరిగిన వెంటనే ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డుపై విష ప్రచారం చేశారు.

తాము ఎలాంటి తప్పు చేయకపోయినా తప్పుడు ఆధారాలతో తిరుపతి లడ్డులో ఆవు కొవ్వు కలిసిందని గత ప్రభుత్వం లడ్డు తయారీ విషయంలో అలసత్వం వహించారంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేశారు ఇప్పటికీ కూడా ఈ లడ్డు తయారీ విషయంలో నిజానిజాలు ఏంటి అనేది బయట పెట్టలేకపోతున్నారని విమర్శించారు. ఆరోజు చంద్రబాబు నాయుడు లడ్డు విషయంలో చేసిన తప్పుడు ప్రచారంలో భాగంగా దేవుడు కళ్ళు తెరిచే శిక్ష విధించాడని తెలిపారు.

రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకున్నారు కాబట్టే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని.. కర్మ ఎవరిని వదిలిపెట్టదని ఈ రూపంలో తిరిగి వచ్చింది అంటూ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఘటనపై ఘాటుగా స్పందిస్తూ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఈ తొక్కిసలాట ఘటనకు చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలంటూ ఈయన డిమాండ్ చేశారు.అయితే ఇప్పటికే 6 మంది మరణించుగా మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. సుమారు 40 మందికి పైగా గాయాలు పాలైనట్లు అధికారులు వెల్లడించారు అయితే వీరందరికీ తిరుపతిలోని ప్రవేట్ ఆసుపత్రులలో చికిత్స అందజేస్తున్నారు.