Roja: బన్నీ పేరు ప్రస్తావిస్తూ పవన్ కు కౌంటర్ ఇచ్చిన రోజా…. చౌకబారు రాజకీయాలు అంటూ?

Roja: సినీ నటి వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మెగా అభిమానులు మరణించిన ఘటనపై స్పందించారు. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా వేడుకను శనివారం రాజమహేంద్రవరంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో ఇద్దరు మెగా అభిమానులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న రాంచరణ్ వెంటనే తన టీం అక్కడికి పంపించి కుటుంబానికి ధైర్యం చెప్పడమే కాకుండా ఆ కుటుంబానికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం అందజేశారు.

ఇక ఈ విషయంపై మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ కూడా వెంటనే స్పందించి ఆ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు కానీ అక్కడికి అల్లు అర్జున్ వెళ్లి పరామర్శించలేదని మానవత్వం లోపించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మరి ఇక్కడ మెగా అభిమానులు మరణించి మూడు రోజులైనా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి డిప్యూటీ సీఎం గారికి తీరిక లేదా అంటూ ప్రశ్నించారు.

ఆ యువకుల తల్లులు, కుటుంబాల కన్నీటి రోదన కనిపించడం లేదా..? పరామర్శించకపోగా వీరి మరణానికి గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు వెయ్యకపోవడం కారణం అంటూ చౌకబారు రాజకీయాలు చేయడం తగునా అంటూ ప్రశ్నించారు.7 నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నది మీ ప్రభుత్వ మే కదా..? 7 నెలలుగా ఆ జిల్లాకు మంత్రిగా ఉన్నది మీరు కాదా..? పవన్ కళ్యాణ్.. రోడ్డు వల్ల చనిపోతే వీరిద్దరి మరణానికి మీకు ఓట్లేసి గెలిపించినందుకు మీరు కారణం కాదా..? మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి అంటూ రోజా పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.