YS Jagan: తిరుపతి తొక్కిసలాట ఘటన….. బాధితుల పరామర్శకు వెళ్లనున్న జగన్!

YS Jagan: తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లకు టోకెన్లను విడుదల చేశారు అయితే ఒక్కసారిగా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో 6 మంది మరణించారు. మృతులు సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది . 40 మందికి పైగా గాయాలు పాలవుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు.

ఇలా ఘటన చోటు చేసుకోవడానికి కారణం సరైన ఏర్పాట్లు చేయకపోవటమేనని తెలుస్తుంది. ఇక ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా ఎంతో మంది రాజకీయ నాయకులు స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇకపోతే మరణించిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలను జారీ చేసింది.

ఇక ఈ ఘటనపై ఇప్పటికే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమని మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక తిరుపతిలో ఇలాంటి ఘటన చోట చేసుకోవడంతో జగన్ తిరుపతికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈయన తిరుపతి వెళ్లి బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పటం కోసం తిరుపతికి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా తిరుపతికి వెళ్లలేదు తిరుపతి లడ్డు విషయంలో కూటమి నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే ఆరోపణలను తిప్పి కొడుతూ వైకాపా వారికి సరైన రీతిలోనే సమాధానం ఇచ్చింది అలాంటి సమయంలోనే జగన్ తిరుమల స్వామివారి దర్శనం నిమిత్తం తిరుపతికి వెళుతున్న నేపథ్యంలో డిక్లరేషన్ ఇస్తేనే రావాల్సి ఉంటుందని చెప్పడంతో ఆయన తిరుపతి పర్యటనను వాయిదా వేసుకున్నారు అయితే నేడు మాత్రం బాధితులను పరామర్శించడం కోసం తిరుపతి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.