Roja: బాబు అధికారంలో ఉంటే చాలు చావులే…. బాబు అసమర్థతే కారణం: రోజా

Roja: తిరుమల తిరుపతిలో వైకుంఠ ద్వారదర్శన టోకెన్లను జారీ చేయడంతో లక్షలాదిమంది భక్తులు తరలి రావడం జరిగింది. అయితే అక్కడ ఏర్పాట్లలో భద్రత లోపించడంతో భాగంగా తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాట ఘటనలో భాగంగా 6 మంది అభిమానులు మరణించారు. సుమారు 40 మంది వరకు గాయాలు పాలయి తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే ఈ ఘటనపై ఇప్పటికే కూటమి పార్టీ నేతలు అలాగే వైకాపా పార్టీ నేతలు కూడా స్పందిస్తున్న సంగతి తెలిసిందే.

కచ్చితంగా ఈ ఘటన వెనుక కుట్ర కోణం దాగి ఉందని ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు కొందరు పాల్పడటంతో ఇలాంటి నష్టం జరిగింది అంటూ కూటమి పార్టీ నేతలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజా సైతం ఈ ఘటన పై స్పందించారు. టీటీడీ, విజిలెన్స్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని.. ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి ఇది నిదర్శమని రోజా మండిపడ్డారు.

వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులకు ఏర్పాట్లు చేయలేదు. తొక్కిసలాట బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి. ఇంతమంది భక్తులు చనిపోతే పీఠాధిపతులు ఎటు వెళ్లారు?. సనాతన యోధుడు అని చెప్పుకున్న పవన్‌ స్పందన ఏది?. నిజమైన సనాతన యోధుడైతే బాధ్యులపై కేసులు పెట్టి చర్యలు తీసుకోండి అంటు డిమాండ్ చేశారు.

ఇక చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా ఇలాంటి తొక్కిసలాటలు జరుగుతాయని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారని తెలిపారు. గతంలో కూడా పుష్కరాల సమయంలో ఇలాంటి తొక్కిసలాట జరిగి సుమారు 29 మంది వరకు మరణించారు. ఇప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని ఇదివరకు తిరుమల చరిత్రలో ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని తెలిపారు. చంద్రబాబు అసమర్థత, వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగింది. ఇక పోలీసులు మొత్తం చంద్రబాబు సేవలో ఉండటం వల్లే భక్తుల సౌకర్యాలను గాలికి వదిలేసారని ఇవి చంద్రబాబు నాయుడు చేసిన హత్యలే అంటూ ఈమె ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.