KTR: మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈయనపై ఏసీబీ కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలి అంటూ కూడా నోటీసులు పంపించారు అయితే తాను లాయర్లతో కలిసి విచారణకు హాజరవుతారని ఈయన కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణలో పాల్గొనడానికి లాయర్లకు కోర్టు అనుమతి తెలపలేదు.
ఈ క్రమంలోనే నేడు ఏఏజీ, న్యాయవాది రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్‌కు వెళ్లారు. ఈ కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్.. మాజీ మంత్రిని విచారిస్తున్నారు. ఈ విచారణను జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షిస్తున్నారు. విచారణను వేరే గది నుంచి చూసేందుకు కేటీఆర్ న్యాయవాదికి ఏర్పాట్లు చేశారు.ముగ్గురు అధికారుల బృందం కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు.
ఇలా అధికారులు ఈయనని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఏసీబీ ఆ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున భద్రత చర్యలను చేపట్టారు. అయితే ఈయన విచారణకు వెళ్లడానికి ముందు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత సంచలనగా మారాయి . తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కార్యకర్తగా, కేసీఆర్ సైనికుడిగా రాష్ట్ర ప్రతిష్ఠ పెంచడానికి, హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలపడానికి తాను ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలిపారు. అందులో భాగంగానే ఫార్ములా ఈ రేస్ ఒకటనే తెలిపారు. అయితే పదేళ్ల మా పాలనలో మేము మా బామ్మర్దులకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇచ్చుకోలేదని ఈయన తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అందుకే మాపై బురద చల్లి రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడేది లేదు. లుచ్చా గాళ్ళ ముందు నేను తలవంచను తెలంగాణ బిడ్డగా కేసీఆర్ బిడ్డగా ఒకటే మాట చెబుతున్నాను తెలంగాణ కోసం చనిపోయే పరిస్థితి వస్తే తాను ఆనందంగా చనిపోతాను అంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
నేను కేసీఆర్ సైనికుడ్ని, నిఖార్సైన తెలంగాణ బిడ్డను.
తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్ట కోసం పనిచేశా. నీలా లుచ్చా పనులు చేయలేదు.
తెలంగాణ కోసం చస్తాను తప్ప.. ఇలాంటి లుచ్చాల ముందు తల వంచను.
కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను బయటకు తెచ్చే వరకూ పోరాడుతూనే ఉంటా.
– బీఆర్ఎస్… pic.twitter.com/ZAZ2lfKTRo
— Thirupathi Bandari (@BTR_KTR) January 9, 2025