Daku Maharaj: తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో భాగంగా పెద్ద ఎత్తున మరణాలు జరిగాయి సుమారు 6 మంది మరణించగా నలుగురు పరిస్థితి విషమంగా ఉందని 40 మందికి పైగా గాయాల పాలయ్యి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనగా మారింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను జారీ చేస్తున్న నేపథ్యంలో లక్షలాదిగా భక్తుల ఒకేసారి తరలి రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది.
ఘటన బాలయ్య అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్న విషయం తెలిసిందే .నేడు బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అనంతపురంలో ఎంతో ఘనంగా నిర్వహించాలని భావించారు అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. అయితే తిరుపతిలో ఇలాంటి ఘటన చోటుచేసుకుని ఆరుగురు మరణించడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా మేకర్స్ వాయిదా వేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అలాగే బాలకృష్ణ కూడా ఈ వేడుక క్యాన్సిల్ కావడంతో సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇటీవల పెద్ద ఎత్తున తొక్కిసలాట జరుగుతూ అభిమానులు మరణిస్తున్న విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా ఒక అభిమాని మరణించడంతో అల్లు అర్జున్ ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చారు.
ఇక రాంచరణ్ హీరోగా నటించిన సినిమా వేడుకను కూడా రాజమహేంద్రవరంలో నిర్వహించారు అయితే ఈ కార్యక్రమానికి లక్షలాదిగా అభిమానులు తరలిరావడం అభిమానులు తిరిగి వెళుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం జరిగింది. ఇక తాజాగా తిరుపతిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఈ సినిమా నిర్మాతలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
ఇక బాబీ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ చిత్రం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కనుక జరిగి ఉంటే ఈ కార్యక్రమానికి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యేవారు. ఏది ఏమైనా ఈ సినిమా వేడుక రద్దు కావడంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.