Justice For Lavanya : జస్టిస్ ఫర్ లావణ్య: మన మీడియాకి పట్టలేదెందుకు.?

Justice For Lavanya : అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు గురించి గంటల తరబడి కథనాలు మన తెలుగు మీడియాలో కనిపిస్తాయి. సినీ సెలబ్రిటీలు తెగ స్పందించేస్తారు. ఎక్కడన్నా మహిళలపై అఘాయిత్యం జరిగితేనో, హత్యాచారం జరిగితేనో.. సందర్భానుసారం అవసరమనుకుంటే రచ్చ అటు మీడియా వైపు నుంచీ, ఇటు సెలబ్రిటీల నుంచీ జరుగుతుంటుంది. ఏదైనా రాజకీయ కోణంలోనే సుమండీ.!

తమిళనాడులో ఓ చిన్నారితో ఓ క్రిస్టియన్ మిషనరీ స్కూల్ బలవంతంగా మత మార్పిడికి యత్నించగా, అందుకామె తిరస్కరించింది. ఈ క్రమంలో చిన్నారిపై స్కూల్ యాజమాన్యం వేధింపులకు దిగింది. క్లాస్ రూమ్‌లను శుభ్రం చేయించడం, బాత్రూమ్‌లనూ ఆమెతో కడిగించడం ద్వారా మిగతా విద్యార్థుల్లో ఆమె పట్ల అసహ్యం కలిగేలా చేసింది సదరు స్కూల్ యాజమాన్యం.

ఈ వేధింపులు తాళలేక లావణ్య బలవన్మరణానికి పాల్పడింది. తనపూ మిషనరీ స్కూల్ యాజమాన్యం వేధింపులకు పాల్పడిన వైనంపై బాధితురాలు వాపోతూ కొన్ని వీడియోలు విడుదల చేసింది కూడా. బలవంతపు మత మార్పిడి కోసం తనను వేధిస్తున్నారంటూ ఆమె వాపోయింది. చివరకు బలవన్మరణానికి పాల్పడింది.

ఈ ఘటనపై ఒక్కరంటే ఒక్క సినీ సెలబ్రిటీ కూడా ఇప్పటిదాకా స్పందించకపోవడం గమనార్హం. దిశ ఘటనలోనో, మరో ఘటనలోనో దేశమంతా స్పందించింది. మరి, ‘జస్టిస్ ఫర్ లావణ్య’ అంశంపై ఎవరూ ఎందుకు స్పందించడంలేదు.? ఇదేమీ మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు. ఏ ఘటన మీద స్పందిస్తే పబ్లిసిటీ వస్తుందో తెలుసుకుని, ఆయా సంఘటనలపై స్పందించడం సెలబ్రిటీలకు రివాజుగా మారిపోయింది.

ఓ బాలిక, మత మార్పిడి మాఫియాకి బలైపోతే.. అది దేశంలో చర్చనీయాంశం కాకపోవడానికి కారణం.. ఆ బాలిక హిందూ మతానికి చెందిన అమ్మాయి కావడమేనేమో.!