Varun Tej -Lavanya: మెగా ఇంట్లో మరో బుల్లి వారసులు రాబోతున్నారని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మెగా చిన్న కోడలు లావణ్య త్రిపాఠి త్వరలోనే తల్లి కాబోతోంది ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా తెలియచేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
వరుణ్ తేజ్ నాగబాబు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక లావణ్య త్రిపాఠి కూడా అందాల రాక్షసి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా పలు సినిమాలలో నటిస్తున్న లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ తో కలిసి రెండు సినిమాలలో నటించారు. ఇలా ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం వీరి ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేయడంతో పెద్దలు కూడా ప్రేమ పెళ్లికి అంగీకరించడం జరిగింది.
ఇక వీరి వివాహం 2023 నవంబర్ ఒకటో తేదీ ఇటలీలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి పలు సినిమాలకు కమిట్ అయి షూటింగ్స్ కూడా పూర్తి చేశారని తెలుస్తోంది అయితే తాజగా ఈమె అభిమానులకు చక్కటి శుభవార్తను తెలియజేశారు. త్వరలోనే వీరిద్దరూ తల్లిదండ్రులుగా మారబోతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు.
ఇలా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులుగా మారబోతున్నారంటూ అధికారికంగా తెలియజేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా కచ్చితంగా ఈ దంపతులకు బాబు పుట్టాలని మెగా వారసుడు రావాలని కామెంట్లు చేస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.