Raj Tarun: టాలీవుడ్ హీరో నటుడు రాజ్ తరుణ్ పేరు మరోసారి సోషల్ మీడియాలో మారు మోగుతోంది. రాజ్ తరుణ్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. తాజాగా అతనిపై మరో పోలీస్ కేసు నమోదైంది. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఇవాళ ఉదయం నర్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి హీరోపై ఫిర్యాదు చేసింది. జూన్ 30న రాజ్ తరుణ్, అతని సహచరులు తనను, తన కుటుంబాన్ని బెదిరించారని లావణ్య తన వాంగ్మూలంలో పేర్కొంది.
అంతేకాకుండా వారు తన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని కూడా ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. అయితే ఇలా ఆభరణాలు ఎత్తుకెళ్లి సమయంలో అడ్డుకున్న తన తండ్రిపై కూడా దాడి చేశారని, తన పెంపుడు కుక్కను సైతం చంపారని లావణ్య వాపోయింది. ఈ ఫిర్యాదు మొదట హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు చేరడంతో ఆయన ఆదేశాల మేరకు నర్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ తో పాటు మణికంఠ తంబాడీ, రాజ్ శేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజలపై కేసు నమోదు చేశారు.
మరోసారి రాజ్ తరుణ్ పై కేసు నమోదు అవ్వడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే మొన్నటి వరకు రాజ్ తరుణ్ పేరు లావణ్య ల పేర్లు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో మారుమోగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వీరిద్దరి వ్యవహారం సంచలనంగా కూడా మారింది. అయితే మరి లావణ్య చేసిన ఆరోపణలపై, కేసు నమోదుపై హీరో రాజ్ తరుణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.
Raj Tarun: హీరో రాజ్ తరుణ్ పై మరో కేసు నమోదు.. గట్టి షాక్ ఇచ్చిన లావణ్య!
