నేటి వేకువఝామున ఏపీ ప్రజలంతా ఉలిక్కిపడే వార్త విన్నారు. విశాఖ గోపాలపట్నం టౌన్ పరిధిలో ఓ విలేజ్ సమీపంలో ఉన్న రసాయన పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్ అయ్యి దాదాపు 200 మంది గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని. ఐదు గ్రామాల్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని.పలువురు మరణించారని మీడియా కథనాలు వేడెక్కించాయి. ఇది ఎంతటి దారుణం. ఓ వైపు కరోనా కల్లోలంతోనే జనం బెంబేలెత్తిపోతుంటే ఇందులో ఇదొకటి. అయితే హిస్టరీలో ఈ తరహా ఇదొక్కటేనా? అంటే ఇలాంటివి అరుదుగా బయటపడుతున్నా.చిన్న చిన్న ప్రమాదాలు అయితే కోకొల్లలు.
అప్పట్లో భోపాల్ (మధ్యప్రదేశ్) గ్యాస్ లీక్ ఘటన ఎంతటి సంచలనమో తెలిసిందే. ఆ ఘటనను గుర్తు చేసుకోవాల్సిన సందర్భమిది. ఈ దుర్ఘటనను భోపాల్ విపత్తు, భోపాల్ వాయువు విషాదం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో గ్యాస్ లీక్ దుర్ఘటనగా చెప్పవచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పారిశ్రామిక ప్రమాదంగా చరిత్రకెక్కింది.
భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పురుగుమందుల ప్లాంట్ లో 1984 డిసెంబరు 2-3 తేదీల్లో మిడ్ నైట్ లో సంభవించింది. 5 లక్షల మందికిపైగా ప్రజలు మిథైల్ ఐసోసనియేట్ (MIC) వాయువు, ఇతర రసాయనాల ప్రభావానికి గురయ్యారు. భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 56 వార్డులు ఉంటే- 36 వార్డుల్లో విషవాయువు ప్రభావం అట్టుడికించింది. నాటి ఘటనలో మృతుల సంఖ్యపై అంచనాలు వేర్వేరుగా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 3,787 మంది. అందులో 2,259 మంది స్పాట్ లోనే మరణానికి గురైనట్టుగా నిర్ధారించింది. 2006 సంవత్సరంలో ఒక ప్రభుత్వ అఫిడవిట్ లో గ్యాస్ లీకేజి వలన 5,58,125 మంది ప్రభావితమైనట్టు పేర్కొంది. ఇందులో 38,478 తాత్కాలిక ప్రభావానికి, 3900 మంది ప్రజలు శాశ్వత ప్రభావానికి గురయ్యారు. అంతేగాక, ప్రమాదం జరిగిన రెండు వారాలలో 8 వేల మంది మరణించారని, గ్యాస్-సంబంధిత వ్యాధుల కారణంగా మరో 8000 పైగా వ్యక్తులు మరణించారని అంచనా.
విపత్తు యొక్క వాస్తవ కారణాలు వివాదాస్పదం. భారతీయ ప్రభుత్వం, స్థానిక కార్యకర్తలు వాదనల ప్రకారం, ఫ్యాక్టరీ నిర్లక్ష్యమైన నిర్వహణ, సరైన నిర్వహణా పద్ధతులను అవలంబించకపోవడమే కారణంగా సాధారణ నిర్వహణా గొట్టాలలోని నీరుని ఒక MIC ట్యాంక్ లోకి చేరి, ఈ విపత్కర పరిస్థితిని పరిస్థితిని సృష్టించింది. అయితే దురుద్దేశ్యపూర్వకంగానే కొంతమంది MIC ట్యాంక్ లోకి నీటిని సరఫరా చేసినట్లుగా యునియన్ కార్బైడ్ కార్పోరేషన్ (యుసిసి) వాదించింది. యుసీసీ ఫ్యాక్టరీ యజమాని, భారత ప్రభుత్వ నియంత్రిత బ్యాంకులతో, 49.1 శాతం వాటాను కలిగి ఉంది. అది భారతదేశపు ప్రజలతో మమేకమై ఉంది.
1989 లో UCC $ 470 మిలియన్లు (2014 లో $ 907 మిలియన్లు) విపత్తు నుండి ఉత్పన్నమయ్యే దావాను పరిష్కరించింది. 1994 లో, యుసిసి UCIL లో తన వాటాను `ఎవర్-రెడీ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ (EIIL)’కు అమ్మేశారు. తరువాత మెక్లీడ్ రస్సెల్ (ఇండియా) లిమిటెడ్ తో విలీనం అయింది. 1998 లో సైట్లో క్లీన్-అప్ ముగిసింది. అనంతరం 99 సంవత్సరాల లీజు రద్దయింది. మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని ఆపేసింది. 2001 లో డౌ కెమికల్ కంపెనీ యుసిసి విపత్తు తరువాత పదిహేను సంవత్సరాల కాలానికి నిర్వహణ కోసం కొనుగోలు చేసింది.
విపత్తు సమయంలో యూసీసీ, వారెన్ ఆండర్సన్, యూసీసీ సీఈవో పాల్గొన్న భారతదేశంలోని భోపాల్ జిల్లా కోర్టులో సివిల్, క్రిమినల్ కేసులు దాఖలు చేయబడ్డాయి. జూన్ 2010 లో, మాజీ UCIL చైర్మన్ సహా ఏడుగురు మాజీ ఉద్యోగులు నిర్దోషులుగా మరణం కలిగించి నిర్దోషిగా రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఒక్కొక్కరికి 2000 డాలర్లు జరిమానా విధించారు.
ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అయితే ప్రస్తుతం ఎస్.ఈ.జెడ్ లు. కెమికల్ కారిడార్లు పేరుతో బోలెడన్ని ఫ్యాక్టరీలో ఆంధ్రా కోస్టల్ లో వెలిసాయి. ముఖ్యంగా కాకినాడ- వైజాగ్ – విజయనగరం బెల్ట్ సహా తుని-పాయకరావు పేట -నక్కపల్లి పరిసరాల్లో సముద్ర తీరాన్ని ఆనుకుని భారీగా కెమికల్ ఫ్యాక్టరీలకు అనుమతులు లభించాయి. ఇక్కడ హెటిరో డ్రగ్స్. డెక్కన్ కెమికల్స్ వంటి భారీ కెమికల్ ఫ్యాక్టరీలు వెలసాయి. వీటిలో డెక్కన్ కెమికల్ లో పురుగుమందుల కెమికల్ తయారీ యూనిట్ ఎంతో ప్రభావవంతమైనది చెబుతుంటారు. మరి వీటి నిర్వహణ విషయంలో జాగ్రత్తలు ఎంత? ప‌్రభుత్వ నార్మ్స్ ప్రకారం రసాయన కాలుష్య కారకాల్ని నియంత్రిస్తున్నారా? అన్నది ప్రశ్నార్థకం.
తాజాగా విశాఖ -గోపాలపట్నంలో ఘటన చాలా చిన్నది. ఇక్కడ ప్రజలు వందల సంఖ్యలోనే కావచ్చు. కానీ ప్రమాద తీవ్రత అధికంగా ఉంటే అది వేలాది మందికి సంకటంగా మారేదని అంచనా వేస్తున్నారు. ఓవైపు ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న ప్రజల్లో రకరకాల చర్చా సాగింది.
సరిగ్గా రెండు మూడేళ్ల క్రితం పాయకరావు పేట-విశాఖ రూరల్ కేశవరం విలేజ్ పరిసరాల్లో ఉన్న డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద శబ్ధాలతో ట్యాంకర్లు పేలిపోవడం. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతో చుట్టుపక్కల దాదాపు 10-20 గ్రామాల ప్రజలు ఇండ్ల నుంచి ఉరుకులు పరుగులు తీశారు. అసలేం జరుగుతోందో అర్థం కాని గందరగోళంలో పడిపోయారు. అయితే అదృష్టవశాత్తూ అది రసాయన విస్పోటనం కాదని తేలింది. రసాయనం తయారు చేయడానికి తెచ్చిన మెటీరియల్ ఉన్న ట్యాంకులు తగలబడడంతో పెను ప్రమాదమే తప్పింది.
అయితే నాటి బ్లో అప్ ని చల్లార్చేందుకు నీటి ట్యాంకర్లకు చాలా సమయం పట్టింది. నాటి నుంచి స్థానిక ప్రజలు రేయింబవళ్లు నిదురపట్టని పరిస్థితికి వెళ్లారన్న టాక్ వినిపిస్తుంటుంది. ఒకవేళ జరగకూడనిదేదో జరిగితే ఏమవుతుంది? ఇక ప్రభుత్వాల టై అప్ తో భారీ కార్పొరెట్ కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టి సామాన్య ప్రజల ప్రాణాల్ని గాల్లో దీపంగా మార్చేయడం చూస్తుంటే ఇది ధనదాహానికి సంబంధించిన క్రతువు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయా ఫ్యాక్టరీల్లో ఉపాధి పొందేందుకు ఆస్కారం ఉండడం ఇక ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి. ప్రజలు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పటికీ డెక్కన్ ఫ్యాక్టరీ ల్యాబుల నుంచి రేయింబవళ్లు రసాయన కాలుష్యం వెదజల్లుతోందన్న ఆవేదన ప్రజల్లో ఉండనే ఉంది.