Sankranthiki Vasthunam: అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ఈ సినిమాపై భారీగా హైప్ ని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన గోదారి గట్టు సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఈపాటే మారుమోగుతోంది.
అంతేకాకుండా ఈ పాట పై కొన్ని వందల రీల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇకపోతే విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్. “నా లైఫ్ లో ఉన్న ఆ ప్రేమ పేజీ తీయనా.. పేజీలో రాసున్నా అందాల ఆ పేరు మీనా..” అంటూ సాగిన ఈ పాట మెప్పిస్తోంది. ఈ సాంగ్ లో వెంకటేష్ పాత్ర తన భార్యకు తన ఎక్స్ గురించి పరిచయం చేస్తున్నట్టు ఉంది.
ఇక ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వంలో భీమ్స్, ప్రణవి ఆచార్య పాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను గట్టిగానే చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఐశ్వర్య రాజేష్, వెంకటేష్ అలాగే అనిల్ రావిపూడి చేస్తున్న కామెడీ కి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం యూట్యూబ్లో అలాగే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం వెంకీ మామ అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా కామెడీ తరహాలో ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.