Roshan kanakala: మరో కొత్త మూవీతో రాబోతున్న రోషన్ కనకాల.. న్యూ మూవీ పోస్టర్ రిలీజ్!

Roshan Kanakala: టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల ఆయన భార్య స్టార్ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తల్లిదండ్రుల వారసత్వంతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రోషన్ కనకాల ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎవరు ఎన్ని విధాలుగా ట్రోల్స్ చేసినా అవి ఏమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే గత ఏడాది బబుల్ గమ్ అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్ కనకాల.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ రోషన్ కనకాలకు ఈ సినిమా ద్వారా భారీగానే గుర్తింపు దక్కింది. దీంతో ఇప్పుడు అదే ఊపుతో మరో సినిమాకు రెడీ అయ్యారు రోషన్ కనకాల. కలర్ ఫోటో ఫ్రేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ మేకర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గానే స్పందన లభించింది.

 

కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న ఈ సినిమా కు మోగ్లీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తే రోషల్ వైల్డ్ లుక్‌ ను తలపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ సాక్షి సాగర్ హీరోయిన్‌ గా కనిపించనుంది. ఈ మూవీని లవ్ స్టోరీగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. లవ్ అలాగే వైల్డ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని అర్థం అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. మొదటి సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకోవడం తో రెండవ సినిమాతో ఎలా అయినా సూపర్ హిట్ అందుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు రోషన్ కనకాల. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి మరి.