వైజాగ్ నేవల్ డాక్ యార్డ్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, నేవల్ డాక్ యార్డ్ అప్రెంటీస్ స్కూల్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కింది ట్రేడ్ లలో అప్రెంటీస్ శిక్షణకు అర్హత ఉన్న అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయం వెలువడింది. ఆన్ లైన్ విధానంలో అప్రెంటీస్ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి నెల 2వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంటుందని చెప్పవచ్చు.

మొత్తం 275 ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 50 శాతం మార్కులతో పదో తరగతి, 65 శాతం మార్కులతో సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాస్ అయిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 14 సంవత్సరాలుగా ఉండాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎలాంటి గరిష్ట వయో పరిమితి లేదు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 7700 రూపాయల నుంచి 8050 రూపాయల వరకు స్టైపెండ్ లభించనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు శిక్షణ వ్యవధి ఏడాదిగా ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2025 సంవత్సరం జనవరి 2వ తేదీ ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా ఉంది.

2025 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ రాతపరీక్షకు చివరి తేదీగా ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది.