Pallavi Prashanth: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మల్లొచ్చినా మీ రైతు బిడ్డని అనే డైలాగుతో యూట్యూబ్ లో అలాగే ఇంస్టాగ్రామ్ సోషల్ మీడియాలో భారీగా సింపతిని సంపాదించుకున్నాడు పల్లవి ప్రశాంత్. ఇక అదే సింపతితో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. రైతు బిడ్డ అనే ట్యాగ్ తో కామన్ మ్యాన్ క్యాటగిరీలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఆఖరి వరకు రైతు బిడ్డ, రైతు బిడ్డ అనే పదాన్ని ఉపయోగిస్తూ భారీగా సింపతి సంపాదించుకొని టైటిల్ ని ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే. హౌస్ లో ఉన్నంతవరకు అమాయకమైన మాట తీరు టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీ తో రైతులకు హెల్ప్ చేస్తాను అంటూ చెప్పినా కళ్లి బుల్లి మాటలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి.
హౌస్ లో ఉన్నప్పుడు డబ్బులు గెలిస్తే రైతులకు పంచి పెడతాను మంచి చేస్తాను అంటూ మంచి మంచి మాటలు చెప్పిన పల్లవి ప్రశాంత్ హౌస్ లో నుంచి బయటకు రాగానే పూర్తిగా మాటలు మార్చేసాడు అని తెలుస్తోంది. ఏదో ఒకరి ఇద్దరికీ హెల్ప్ చేశాడు. భారీగా ట్రోల్స్ రావడంతో ఒక పేద కుటుంబానికి లక్ష రూపాయల సహాయం చేశాడు. ఆ తర్వాత ఇచ్చిన మాట గురించి రైతుల సహాయం గురించి పూర్తిగా మరిచిపోయాడు. దాంతో పల్లవి ప్రశాంత్ పై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి రావడంతో ఆయన వాకింగ్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ మాట తీరు ఇవన్నీ మారిపోయాయి. రైతు బిడ్డగా ఉన్న పల్లవి ప్రశాంత్ కాస్త రాయల్ బిడ్డగా మారిపోయాడు. ఇటీవల కాలంలో పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలే అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు.
అందులో ప్రశాంత్ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కలర్ ఫుల్ డ్రెస్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సోకులకేం తక్కువ లేదు, ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు డబ్బులు పంచు అని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. లుక్ మార్చేశావేంటన్నా..రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. రోజురోజుకీ వీడి బిల్డప్ చూడలేకపోతున్నాం రా బాబు అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా నెగిటివ్ కామెంట్స్ తో పల్లవి ప్రశాంత్ ని ఏకిపారేస్తున్నారు నెటిజన్స్. మొత్తానికి పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా వదలట్లేదు కొందరు నెటిజన్లు. ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలోనూ రైతు బిడ్డ షేర్ చేసిన పోస్ట్ మిస్ ఫైర్ అవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో మండిపడిన విషయం తెలిసిందే. అయినా కూడా మన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ లో మాత్రం మార్పు రావడం లేదు.