నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టు కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్టీపీసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 50 ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
డిప్లొమా/అడ్వాన్స్‌డ్ డిప్లొమా/పీజీ డిప్లొమా చేయడంతో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ప్రొడక్షన్, కెమికల్, కన్స్ట్రక్షన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. గరిష్టంగా 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. https://careers.ntpc.co.in/recruitment/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 300 రూపాయలను నాన్-రీఫండబుల్ అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రాతపరీక్ష, సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, ఎగ్జిక్యూటివ్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.