భక్తుల కోరికలను తీర్చే ఆంజనేయస్వామి గుడి.. ఈ ఆలయం ప్రత్యేకతలు ఇవే!

మనలో చాలామంది హనుమంతుడిని ఎంతో భక్తితో విశ్వసిస్తారు. హనుమంతుడిని పూజిస్తే మంచి జరుగుతుందని భక్తులు బలంగా నమ్ముతారు. అయితే వైజాగ్ లో ఉన్న ఒక హనుమంతుడి ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల కోరుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే భయాలు కూడా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.

రామ్ నగర్ లో ఉన్న రాముడి ఆలయంలో ఉన్న హనుమంతుడిని దర్శించుకుంటే మాత్రం కచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ ఆలయంలో వేల సంఖ్యలో తమలపాకులతో పురోహితులు స్వామివారికి పూజలు చేస్తారు. అన్నసంతర్పణ, భజనతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి రోజున స్వామివారిని దర్శించుకుంటే దేవుని ఆశీర్వాదం లభిస్తుందని ఇక్కడి భక్తులు నమ్ముతారు.

ఈ ఆలయంలో వారంలో అన్నిరోజులు అర్చకులు అందుబాటులో సకాలంలో దేవుడికి పూజలు చేస్తారు. విశాఖ వాసులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లు సైతం ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కి సమీపంలో ఈ ఆలయం ఉండగా ఈ ఆలయంలో రద్దీ బాగానే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఆంజనేయస్వామిని పూజిస్తే ధైర్యం కలుగుతుందని కూడా చాలామంది భక్తులు ఫీలవుతారనే సంగతి తెలిసిందే. హనుమాన్ జయంతి రోజున భక్తులు ఎక్కువ సంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శించుకునే ఛాన్స్ అయితే ఉంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆంజనేస్వామి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మరింత ప్రశాంతత కలుగుతుందని చెప్పారు.