మెగాస్టార్ చిరంజీవి చాలా మారారట.! చాలా అంటే చాలా చాలా మారిపోయారట.! ఏంటి.? ఒక్క సినిమా వైఫల్యంతోనేనా.? అంటే, వైఫల్యం అని కాదుగానీ, చిరంజీవి ఎప్పుడూ మార్పుని కోరుకుంటుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ, కామెడీ విషయంలోనూ, డాన్సుల విషయంలోనూ ఈ మధ్య ‘పరమ రొటీన్’ అనే విమర్శల్ని ఎదుర్కొంటున్నారు.
చిరంజీవి కామెడీ టైమింగ్ ఎప్పటికీ బోర్ కొట్టదు. కానీ, చిరంజీవి చుట్టూ ఈ మధ్య ఆయా సినిమాల్లో కనిపిస్తున్న కామెడీ గ్యాంగ్ నుంచి పుడుతోన్న కామెడీ, అస్సలేమాత్రం బాగోడంలేదు. అందుకే, ఆ గ్యాంగ్‌ని చిరంజీవి దాదాపు దూరం పెట్టేసినట్లు తెలుస్తోంది ‘విశ్వంభర’ కోసం.
నిజానికి ‘విశ్వంభర’లో కామెడీకి స్కోప్ తక్కువే. చిరంజీవి గత సినిమాల్లో రొటీన్‌గా కనిపించిన కొందరు నటీనటులు, ‘విశ్వంభర’లో వుండరు. అంతే కాదు, కాస్ట్యూమ్స్ పరంగా కూడా చిరంజీవి చాలా మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టైలింగ్ విషయంలోనూ, చిరంజీవి కొత్త నిర్ణయాలు తీసుకున్నారట.
డాన్స్ కొరియోగ్రఫీ పరంగానూ మార్పులు చేశారు. యాక్షన్ స్టంట్స్ వరకూ ఇబ్బందేమీ లేదు. సినిమాటోగ్రఫీ కూడా అంతే. ఇన్ని మార్పులు చిరంజీవి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, దానిక్కారణం ‘భోళా శంకర్’.
మరి, చిరంజీవినే నమ్ముకున్న కమెడియన్ల గ్యాంగ్ పరిస్థితేంటి.? అంటే, ‘విశ్వంభర’ తర్వాత వాళ్ళని మళ్ళీ చిరంజీవి ఎలాగోలా అకామొడేట్ చేయొచ్చన్నది ఇన్సైడ్ సోర్సెస్ కథనం. అన్నట్టు, కథలోనూ వేలు పెట్టే స్థాయికి చిరంజీవికి సన్నిహితులుగా మారిపోయిన ఒకరిద్దరు నటుల్ని చిరంజీవి ఎంత దూరం పెడితే అంత మంచిదనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.