PV Sindhu: పి.వి. సింధు వెడ్డింగ్ రెసెప్షన్ లో మెరిసిన సెలబ్రిటీస్.. ఎవరెవరు హాజరయ్యారో తెలుసా?

PV Sindhu: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమెకు దేశవ్యాప్తంగా భారీగా గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. బ్యాట్మింటన్ లో ఎన్నెన్నో పథకాలను సాధించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సింధు. ఇది ఇలా ఉంటే ఇటివలే ఈమె మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త వెంకట సాయి తో కలిసి ఏడడుగులు వేసింది. వీరి వివాహం గత ఆదివారం ఉదయపూర్ లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ఈ జంట.

రాజస్థాన్ లో గ్రాండ్ వెడ్డింగ్ అనంతరం తాజాగా హైదరాబాద్ లో వీరి రెసెప్షన్ జరిగింది. ఇక ఈ వేడుకకి చాలా మంది టాలీవుడ్ సినీ సెలెబ్రిటీస్ హాజరయ్యారు. తాజాగా జరిగిన ఈ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి నవ వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చారు. అలాగే అక్కినేని కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో అజిత్ కూడా వచ్చారు. టాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సైతం సింధు రెసెప్షన్ లో మెరిసింది. అలాగే సింగర్ మంగ్లీ కూడా హాజరయ్యారు.

 

వీరితో పాటుగా భారత సానియా మీర్జా కూడా ఈ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఇంకా కొంతమంది క్రీడాకారులు, రాజకీయ నాయకులు, ఈ వేడుకకు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు చూసిన అభిమానులు నెటిజెన్స్ నవ వధువు వరులను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోస్ వైరల్ గా మారాయి. అయితే పీవీ సింధు ఇప్పటికే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా అనేక పథకాలను సాధించిన విషయం తెలిసిందే.