Nagarjuna: చైతన్య కంటే ముందే శోభిత నాకు తెలుసు…. వారిద్దరిని చూస్తే ఆనందంగా ఉంటుంది: నాగార్జున

Nagarjuna: సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇటీవల ఒక ఆంగ్ల మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా నాగార్జున తన కొత్త కోడలు శోభిత గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల నాగచైతన్య శోభిత వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్యకు ఇది రెండో వివాహం కావడం గమనార్హం. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకున్నారు.

డిసెంబర్ 4వ తేదీ వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా జరిగింది. ఇకపోతే తాజాగా నాగార్జున తన కొడుకు కోడలు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. శోభిత నాకు నాగచైతన్య కంటే ముందే తెలుసని తెలిపారు. నాగచైతన్యకు పరిచయం కావడం కంటే ముందుగానే ఈమె నాకు పరిచయం అయిందని ఆమె చాలా మంచి అమ్మాయి మంచి మనసున్న అమ్మాయి అని తెలిపారు.

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో నటిగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. శోభిత ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తుంది ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తుందని నాగార్జున తెలిపారు. శోభిత మా ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత నాగచైతన్య కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా వారిద్దరిని చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుందని నాగార్జున తెలియజేశారు. శోభిత నాగచైతన్య జీవితంలోకి వచ్చినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు..

గూడాచారి సినిమా చూసిన తర్వాత శోభితతో ఫోన్లో మాట్లాడి ఆమెను అభినందించినట్లు తెలిపారు. అలాగే ఓసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి తప్పకుండా రావాలని ఆమెను ఇన్వైట్ చేసినట్టు నాగార్జున తెలిపారు. ఇక 2018 సంవత్సరంలో మొదటిసారి శోభిత మా ఇంటికి వచ్చిందని ఈ సందర్భంగా తన కొత్త కోడలి గురించి నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి