Venkatesh: నాగ చైతన్య పై వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు…అలా అనిపిస్తుందంటూ?

Venkatesh: సినీ నటుడు వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్లలో భాగంగా వెంకటేష్ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమంలో వెంకటేష్ తో పాటు తన అన్నయ్య సురేష్ బాబు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇలా ఈ కార్యక్రమంలో బాలకృష్ణ వెంకటేష్ మధ్య ఎన్నో విషయాలు చర్చకు వచ్చాయి అలాగే తన తండ్రి గురించి అడగడంతో వెంకటేష్ కాస్త ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇదిలా ఉండగా బాలకృష్ణ ఈ షోలో వెంకటేష్ తన కూతుర్లతో ఉన్నటువంటి ఫోటోలను చూపించారు ఇక ఆ ఫోటో గురించి వెంకటేష్ మాట్లాడుతూ మై వండర్ఫుల్ డాటర్స్ అంటూ తన ముగ్గురు కూతుర్ల పేర్లు ఆశ్రిత, హవ్య, భావన అంటూ వారి పేర్లను చెప్పుకువచ్చారు. అనంతరం తన మేనల్లుడు నాగచైతన్య ఫోటోని కూడా చూపించారు.

ఇలా నాగచైతన్య ఫోటోని చూసిన తర్వాత వెంకటేష్ నాగ చైతన్య గురించి మాట్లాడుతూ… సాధారణంగా మనం ఎంతో మంది పిల్లలను హగ్ చేసుకుంటూ ఉంటాము కానీ వీటిని మాత్రం హగ్ చేసుకుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది అంటూ తన మేనల్లుడు గురించి వెంకటేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక నాగ చైతన్య వెంకటేశ్ సోదరి లక్ష్మీ దగ్గుబాటి కుమారుడనే విషయం మనకు తెలిసిందే .ఇక ఈమె మొదటగా నాగార్జున వివాహం చేసుకున్నారు. నాగచైతన్య జన్మించిన తర్వాత లక్ష్మికి విడాకులు ఇచ్చిన నాగర్జున అమలను పెళ్లి చేసుకున్నారు. ఇలా నాగార్జున లక్ష్మి విడిపోయినప్పటికీ దగ్గుబాటి ఫ్యామిలీకి నాగచైతన్యకు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.