Mohan Babu: నా జర్నీలో ఆ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్!

Mohan Babu: టాలీవుడ్ మోహన్ బాబు పేరు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడు లేనిది మోహన్ బాబు కోర్టు పోలీస్ కేసు వివాదాలు అంటూ వరుసగా వార్తలు నిలుస్తున్నారు. అలాగే బ్యాక్ టు బ్యాక్ సోషల్ మీడియాలో ట్వీట్ లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను గతంలో నటించిన తన ఫిల్మోగ్రఫీలోని సినిమాలను రోజు ఒకటి గుర్తు చేసుకుంటున్నారు మోహన్ బాబు. తాజాగా పట్నం వచ్చిన ప్రతివ్రతలు సినిమా గురించి తన అనుభవాన్ని పోస్ట్ చేశారు.

ఈ మేరకు ఆయన ఆ విషయం గురించి పోస్ట్ చేస్తూ..1982లో నటించిన పట్నం వచ్చిన ప్రతివ్రతలు సినిమాకు నా ప్రయాణంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. టాలెంటెడ్ డైరెక్టర్ మౌలీ తన పాత్రను అద్బుతంగా తీర్చి దిద్దారు. నా మిత్రుడు చిరంజీవితో అన్నదమ్ములుగా నటించడం నా కెరీర్‌ లోనే మరిచిపోలేని పాత్ర అని గుర్తు చేసుకున్నారు మోహన్ బాబు. నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని చిత్రాల్లో పట్నం వచ్చిన ప్రతివ్రతలు సినిమా కచ్చితంగా ఉంటుందని మోహన్ బాబు ట్విటర్‌ లో రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ పై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరోవైపు మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేసిన ఘటన కేసు సోమవారం రోజుకు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోహన్ బాబుకు తిప్పలు తప్పడం లేదు. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల ఆయన కొడుకులు మంచు మనోజ్ మంచు విష్ణువుల మధ్య జరిగిన వివాదంలో ఒకరకంగా మంచు మోహన్ బాబు బలి అయ్యారనే చెప్పాలి.