Sri Tej: శ్రీ తేజ్ కుటుంబానికి ఇప్పటివరకు వచ్చిన ఆర్థిక సహాయం ఎంతో తెలుసా?

Sri tej: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి అనే అభిమాని మరణించారు అయితే ఈమె మరణించడమే కాకుండా తన కుమారుడు శ్రీ తేజ్ సైతం తీవ్రంగా గాయపడటంతో ప్రస్తుతం ఈ చిన్నారి హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఇప్పుడిప్పుడే ఆ చిన్నారి ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుందని అతనిలో స్పర్శలు కూడా మొదలయ్యాయి అని వైద్యులు తన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

ఇక ఈ ఘటనలో భాగంగా రేవతి అనే అభిమాని మరణించడంతో ఏకంగా అల్లు అర్జున్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితిలు కూడా ఏర్పడ్డాయి. దీంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. అయితే బాధిత కుటుంబానికి పెద్ద ఎత్తున సినీ నిర్మాతలు హీరోలు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీ తేజ కుటుంబానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంత మొత్తంలో ఆర్థిక సహాయం అందింది ఏంటి అనే విషయానికి వస్తే…

ఈ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ 25 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు కానీ ఈ విషయంలో సర్కార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏకంగా అల్లు అర్జున్ కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు అలాగే డైరెక్టర్ సుకుమార్ 50 లక్షలు మైత్రి మూవీ మేకర్స్ వారు 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇలా సుమారు రెండు కోట్ల వరకు ఈయనకు ఆర్థిక సహాయం అందినట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఈయనకు 25 లక్షల రూపాయల అందజేశారు.

ఇలా డబ్బును అందించడంతోపాటు నిర్మాత దిల్ రాజు శ్రీ తేజ తండ్రికి సినిమా ఇండస్ట్రీలోని ఏదైనా ఒక ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ డబ్బులతో ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. అలాగే తమ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని దర్శక నిర్మాతలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.