Pushpa 2: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ చిత్రం పుష్ప 2. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా కారణంగా అల్లు అర్జున్ వివాదంలో చిక్కుకోవడం ఆయనని పోలీసులు అరెస్టు చేయడం బెయిలు మీద బయటకు రావడం వంటివి జరిగిపోయాయి. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో అద్భుతమైన విజయం అందుకున్నా అల్లు అర్జున్ కి మాత్రం సంతోషం లేదని చెప్పాలి.
ఈ విధంగా ఈ సినిమా కారణంగా అల్లు అర్జున్ ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. ఇకపోతే మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ వరుస అప్డేట్స్ తెలియజేస్తున్నారు. ఈ సినిమా నుంచి పెద్ద ఎత్తున ఫుల్ సాంగ్స్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ షేకావత్ ఆఫీసర్ కు వార్నింగ్ ఇస్తూ దమ్ముంటే పట్టుకోరా షేకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అనే రెండు లైన్ల లిరిక్ ఎంతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా షెకావత్ తో సవాలు చేసి.. పుష్ప ఓ పాట పాడతాడు. నాలుగు లైన్స్ ను వార్నింగ్ చెప్పినట్లు చెప్తాడు. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ .. పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. మళ్లీ భుజాన గొడ్డలేసి.. కూలీగా పోతాను నేను అడివికేసి. ఈ లైన్స్ ను రైమింగ్ లో పాడుతూ మిగతావారితో పాడిస్తాడు పుష్ప. ఇప్పుడు ఆ ఫుల్ సాంగ్ డీజే మిక్సింగ్ లో రావడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ పాట ప్రస్తుతం రిలీజ్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు పుష్ప మేకర్స్ పై మండిపడుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్న సుచివేషన్లో ఇలాంటి పాట విడుదల చేయడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. పోలీసులను రెచ్చగొట్టే విధంగా ఈ సాంగ్ ఉన్న నేపథ్యంలో ఈ పాటను విడుదల చేసి అల్లు అర్జున్ కి మరింత ఇబ్బంది కలుగజేస్తున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.