Manchu Vishnu: అల్లు అర్జున్ వివాదం తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై తొలిసారి మంచు విష్ణు స్పందించారు. ఈ క్రమంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు కూడా ఈయన తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు. అల్లు అర్జున్ విషయంలో ఇటు రాజకీయ నాయకులు అటు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా పెద్ద ఎత్తున వారి అభిప్రాయాలను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ఇలాంటి తరుణంలోనే మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి విషయంలో ఎవరు కూడా స్పందించవద్దని తెలిపారు. ఇది చాలా సున్నితమైన విషయం హైదరాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి.. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉందని వివరించాడు. ప్రతీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తోందని స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మా సభ్యులకు వినతి. సున్నితమైన విషయాలపై మా సభ్యులు స్పందించొద్దని సూచించాడు.
సభ్యుల వ్యక్తిగత విషయాల గురించి స్పందించపోవడమే మంచిది ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల స్పందించడంతో సంబంధిత వ్యక్తులకు మరింత నష్టం కలిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఈ విషయం గురించి స్పందించకూడదని తెలిపారు. ఇలాంటి విషయాలలో మా సభ్యులలో ఐక్యత ఎంతో అవసరమని వెల్లడించారు.
ఇలా మంచి విష్ణు చేసిన వ్యాఖ్యలు ఒకవైపు అల్లు అర్జున్ గురించి ఎవరు మాట్లాడొద్దని అదే విధంగా గత కొంతకాలంగా తమ కుటుంబంలో జరుగుతున్న గొడవలు గురించి కూడా ఇండస్ట్రీ వ్యక్తులు స్పందించకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.