Allu Arjun: అల్లు అర్జున్ ను వదలని 11 నెంబర్… దరిద్ర దేవతల వెంటాడుతుందిగా?

Allu Arjun: సాధారణంగా కొంతమంది కొన్ని విషయాలను ఎంతో కచ్చితంగా విశ్వసిస్తూ వాటిని పాటిస్తూ ఉంటారు. అది పండితులు చెప్పే జ్యోతిషమైన లేదంటే ఇతర విషయాలలో అయినా కూడా చాలా సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు కొన్నిసార్లు మనకు పదేపదే ఒకే విషయం గురించి ఏదైనా అనిపిస్తుంది అంటే ప్రకృతి మనకి ముందుగానే ఏదో జరగబోతుందని హెచ్చరించినట్లు అని చాలామంది భావిస్తూ ఉంటారు. అలా అల్లు అర్జున్ విషయంలో కూడా 11 అనే నెంబర్ ముందు నుంచి తనకి ఏదో సమాచారాన్ని అందజేస్తుందని చెప్పాలి.

గత కొంతకాలంగా అల్లు అర్జున్ లో ఈ 11 అనే నెంబర్ వెంటాడుతూనే ఉంది ఎప్పుడైతే ఈ 11 అనే నెంబర్ తనని తగులుకుందో అప్పటినుంచి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అల్లు అర్జున్ జీవితంలో ఈ 11 నెంబర్ ఎంత ప్రాధాన్యత పోషించింది అనే విషయానికే వస్తే… అల్లు అర్జున్ వార్తలలో నిలవడానికి కారణం నంద్యాలకు తన స్నేహితుడికి మద్దతు తెలపడం కోసం వెళ్లటమే కారణమని చెప్పాలి అయితే ఆయన మే 11వ తేదీ నంద్యాలకు వెళ్లి మెగా కుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

ఇలా అల్లు అర్జున్ వెళ్ళటంతో అప్పటినుంచి ఈయన వార్తల్లో నిలుస్తూనే వివాదాలను ఎదుర్కొంటున్నారు. ఇక పుష్ప సినిమా చూడటం కోసం వెళ్ళిన అల్లు అర్జున్ సరిగ్గా 11 గంటల సమయానికి తొక్కిసలాట ఘటన జరిగి అభిమాని మరణించింది. ఇక ఈయన బెల్ మీద బయటకు వచ్చిన 11 గంటలకు విచారణకు రావాలని పోలీసులు తనని మళ్లీ పోలీస్ స్టేషన్ కి రప్పించారు. ఇక ఈ కేసులో అల్లు అర్జున్ A11 ముద్దాయిగా నమోదు అయ్యారు. ఇలా ఈ సంఘటనలన్నింటిని బట్టి చూస్తుంటే ఈ 11 అనే సంఖ్య అల్లు అర్జున్ జీవితాన్ని పూర్తిగా డౌన్ ఫాల్ చేసిందని చెప్పాలి. ఇది కేవలం ఒక జస్ట్ నెంబర్ నేనా లేకపోతే నిజంగానే నిపుణులు చెప్పినట్టు ఈ 11 అల్లు అర్జున్ ని బాగా డౌన్ ఫాల్ చేయబోతుందా? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.