Anchor Pradeep: టాలీవుడ్ ప్రముఖ యాంకర్ ప్రదీప్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరించి టాప్ ఫైవ్ మెయిల్ యాంకర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మొన్నటి వరకు యాంకర్ గా బిజీబిజీగా గడిపిన ప్రదీప్ ఈ మధ్య కాలంలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మొదట హీరోగా ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సినిమా విడుదల అయ్యి పరవాలేదు అనిపించింది.
ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో టాలీవుడ్ ఫిమేల్ యాంకర్ దీపిక పిల్లి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ నితిన్, భరత్ లు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ వాడి సినిమాపై హైప్ తెచ్చారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటగా ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసారు. టచ్ లో ఉండు ఓరబ్బీ..అంటూ సాగిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్లో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పాటు సూపర్ గా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ పాటను చంద్రబోస్ రాయగా రధన్ సంగీత దర్శకత్వంలో లక్ష్మి దాస, రఘు పాడారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేసారు. ఈ పాటలో నటి చంద్రిక రవి పెర్ఫార్మ్ చేసింది. ఇప్పటికే షూటింగ్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని మూవీ మేకర్స్ వెల్లడించారు. మరి ఈ సినిమా ప్రదీప్ కి ఏ మేరకు సక్సెస్ ని తెచ్చి పెడుతుందో చూడాలి మరి.