ఆ హీరోలతో సినిమాలు చేయాలనుకున్నాను కానీ.. డైరెక్టర్ శంకర్ షాకింగ్ కామెంట్స్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా,శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గేమ్ చేంజర్. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమా. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు మూవీ యూనిట్. ఇందులో భాగంగానే చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ ని యూఎస్ఏ లోని డల్లాస్ లో నిర్వహించారు. ఈ వేడుకకి గేమ్ చేంజర్ మూవీ యూనిట్ తో పాటు పుష్ప డైరెక్టర్ సుకుమార్, ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు కూడా అతిథులుగా హాజరయ్యారు.

ఇక ఈ ఈవెంట్లో డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ టాలీవుడ్ సినిమా హీరోలతో తాను ఇదివరకే సినిమాలు చేయాలనుకున్నానని కానీ కుదరలేదని చెప్పారు. చిరంజీవితో సినిమా చేయాలనుకున్నాను, అలాగే మహేష్ బాబు తో కూడా సినిమా తీయాలనుకున్నాను. ఆఖరికి కరోనా టైంలో ప్రభాస్ తో సినిమా తీయటానికి డిస్కషన్స్ కూడా జరిగాయి కానీ అవేవీ సెట్ కాలేదు.

ఆఖరికి రామ్ చరణ్ తో మూవీ సెట్ అయింది. పోకిరి, ఒక్కడు లాంటి మాస్ ఎంటర్టైనర్ సినిమాలు చేయాలని అనుకున్నాను, అందులో కూడా నా మార్కు ఉండాలని భావించాను అలాంటి ఆలోచనలతో చేసినదే ఈ గేమ్ చేంజర్ మూవీ. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాను. అందుకే ఇక్కడికి రావాలా వద్దా అని ఎంతగానో ఆలోచించాను. తమిళం, హిందీలో సినిమాలు చేశాను కానీ తెలుగులో ఇప్పటివరకు చేయలేదు.

గేమ్ చేంజర్ సినిమా నా మొదటి తెలుగు సినిమా. ఒక గవర్నమెంట్ అధికారి రాజకీయ నాయకుల మధ్య సంఘర్షణ చుట్టూ ఈ సినిమా కథ ఉంటుంది. ఇందులో రామ్ చరణ్ ఎంతో సెటిల్ గా నటించారు సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ నటనతో అదరగొట్టారు అని చెప్పుకొచ్చారు శంకర్. ఇక ఈ సినిమా విషయానికి వస్తే త్రిబుల్ ఆర్ సినిమా తరువాత వస్తున్న రామ్ చరణ్ మూవీ కావటం దానికి శంకర్ డైరెక్షన్ తోడవడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

రామ్ చరణ్ తో సినిమా కోసం.. చిరంజీవి, ప్రభాస్ తో సినిమా.. | Shankar Speech At Game Changer Event USA