Venu Swamy: ప్రముఖ సంచలనాత్మక జ్యోతిష్యులు వేణు స్వామి తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తలో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఈయన అల్లు అర్జున్ జాతకం గురించి మాట్లాడుతూ మరోసారి వార్తల్లో నిలిచారు. అల్లు అర్జున్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈయన జైలుకు కూడా వెళ్లి వచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి అనే అభిమాని మరణించడంతో అందుకు పరోక్ష కారణం అల్లు అర్జున్ అంటూ తెలంగాణ సర్కార్ ఈయనపై కేసు నమోదు చేసి ఏకంగా జైలుకు కూడా పంపించారు.
ఈ విధంగా అల్లు అర్జున్ అరెస్టు చేయడం పట్ల ఎంతో మంది రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీలు తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం ఈ విషయం పట్ల అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో వివాదాలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలోనే అల్లు అర్జున్ జాతకం గురించి వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఘటనలో భాగంగా గాయపడిన చిన్నారి శ్రీ తేజ్ గురించి ఆయన మాట్లాడుతూ తనకు తన తరుపున 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు అంతేకాకుండా తన గురించి మృత్యుంజయ హోమం కూడా చేస్తానని వేణు స్వామి తెలిపారు. ఇక అల్లు అర్జున్ జాతకం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఆయన జాతకం ఏ మాత్రం బాగాలేదని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 28వ తేదీ వరకు తన జాతకం అలాగే ఉంటుందని వేణు స్వామి తెలిపారు.
మార్చి 28 తర్వాత ఆయనకి అంత శుభమే జరుగుతుంది. ఈ తొక్కిసలాట ఘటన అనేది అనుకోకుండా జరిగినదని వేణు స్వామి తెలియజేశారు. అయితే వేణు స్వామి గతంలో కూడా అల్లు అర్జున్ జాతకం గురించి మాట్లాడారు. అల్లు అర్జున్ కు రాజయోగం ఉందని తెలిపారు. అయితే ఆయన చెప్పిన కొద్ది రోజులకే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు ఇక అరెస్టు అయిన తర్వాత కూడా కచ్చితంగా అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెడతారని ఆయన సీఎం అవుతారు అంటూ కూడా ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.