Venu Swamy: గొప్ప మనసు చాటుకున్న వేణు స్వామి.. శ్రీ తేజ్ కు 2 లక్షలు ఇవ్వడంతో పాటు మృత్యుంజయ హోమం!

Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి మనందరికీ తెలిసిందే. తరచూ సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు వేణు స్వామి. ఇక వేణు స్వామి భార్య వీణ గురించి కూడా మనందరికీ తెలిసిందే. కాగా తరచూ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు వేణు స్వామి. ఈ నేపథ్యంలోనే కొన్ని కొన్ని సార్లు ట్రోలింగ్స్ ని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పటికే చాలా సందర్భాలలో ఆయా హీరోల అభిమానులు వేణు స్వామిని దారుణంగా ట్రోలింగ్స్ చేసిన విషయం తెలిసింది. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా వేణు స్వామి తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నారు.

సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ ని సందర్శించిన ఆయన రేవతి రేవతి భర్త భాస్కర్ ను పరామర్శించి శ్రీతేజ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీతేజ్ కోసం రెండు లక్షల ఆర్థిక సహాయం కూడా చేశారు. రెండు లక్షల రూపాయలు చెక్కు రూపంలో భాస్కర్ కుటుంబానికి అందజేశారు. అనంతరం వేణు స్వామి మాట్లాడుతూ.. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాబు కోసం ఈ వారంలో మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను. 2 లక్షల రూపాయలు భాస్కర్ కుటుంబానికి ఇస్తున్నాను. శని ఉండడం వల్ల అల్లు అర్జున్ కు ఈ సంఘటన జరిగింది. అతని జాతకం వచ్చే ఏడాది మార్చి మార్చి 29 వరకు బాగోలేదు. కాస్త జాగ్రత్తగా ఉండాలి.

ఎవరు కావాలని ఏది చేయరు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు జరుగుతుంటాయి. శ్రీ తేజ పైన వారి తండ్రి చెయ్యి వేయగానే అది చూసి కళ్ళ లోంచి నీళ్లు వచ్చాయి. శ్రీ తేజ కోలుకుంటాడన్న నమ్మకం ఉంది. కచ్చితంగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను. శ్రీ తేజకు మృత్యుంజయ హోమం నా స్వంత ఖర్చులతో చేస్తాను. పాప కు రెండు లక్షల ఆర్థిక సాయం చేస్తున్నాను. నేను టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు ముహూర్తాలు పెట్టాను. కాబట్టి నేను సినిమా వాడినే. అందుకే శ్రీతేజ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నాను. వారం రోజుల్లో హోమం నిర్వహిస్తాను. ఆ పిల్లాడికి ఏమి కాదు అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.