Jagapathi Babu: స్ట్రీట్ ఫుడ్ ఆస్వాదిస్తున్న టాలీవుడ్ నటుడు జగపతి బాబు.. నెట్టింట వీడియో వైరల్!

Jagapathi Babu: టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు జగపతిబాబు. ఎక్కువగా సినిమాలలో విలన్ క్యారెక్టర్లలో నటిస్తూ మెప్పిస్తున్నారు. ప్రస్తుతం జగపతిబాబు చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. తాను చేసే చిలిపి చిలిపి పనుల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

అందులో సరదాగా ఫన్నీ వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా కూడా మరో వీడియోని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు జగపతిబాబు. భీమవరం ఫుడ్‌ ఫెస్టివల్‌లో రోడ్డు పక్కనే ఉన్న బండి వద్ద ఫుడ్ ఆరగించారు జగపతిబాబు. మరికొందరు నటులతో కలిసి రోడ్‌ సైడ్‌ ఫుడ్‌ను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ద్వారా షేర్ చేశారు. భీమవరం ఫుడ్ ఫెస్టివల్‌ కంటిన్యూటికీ ఈ మనిషి రోడ్డున పడ్డాడు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

ఆ వీడియో పై స్పందించిన అభిమానం మీరు నిజంగా చాలా గ్రేట్ సార్ అంత పెద్ద సెలబ్రిటీ అయి ఉండి ఇలా స్ట్రీట్ ఫుడ్ ను ఆస్వాదించడం అన్నది గొప్ప విషయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీలు స్ట్రీట్ ఫుడ్ తినరు కానీ అలాంటిది మీరు అవేవీ పట్టించుకోకుండా తింటున్నారు రియల్లీ గ్రేట్ సార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే జగపతిబాబు కెరియర్ విషయానికి వస్తే.. ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమాలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.